Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: సంచాలక్ గా గీతు ఓవరేక్షన్


బిగ్ బాస్ సీజన్ 6 లో నేనే గ్రేట్, నేనే తోపు, నేనొక్కదానినే గేమ్ బాగా ఆడతాను, నేను మాత్రమే హౌస్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అంటూ విర్రవీగే గీతు టాస్క్ ల్లో కేవలం మైండ్ గేమ్ మాత్రమే పెడుతుంది కానీ.. ఫిజికల్ గా వీక్. గత రాత్రి కెప్టెన్సీ టాస్క్ లో ఆది రెడ్డి తో కలిసి ఆడిన గీతు మొదటి రౌండ్ లోనే ఓడిపోయి ఏడ్చేసింది. అందరూ ఆమెని ఓదార్చారు. తర్వాత కూడా రేవంత్ తోసేశాడని నీ యబ్బ అంటూ మాట్లాడిన గీతు.. కెప్టెన్సీ టాస్క్ నుండి తొలిగిపోయినా.. ఏదో ఒకటి ఆడాలంటూ ఓవర్ చేస్తుంది. రాత్రి కూడా చేపలను కొట్టేసేందుకు రేవంత్ దగ్గర ఇంకా చాలామంది దగ్గర గేమ్ ప్లే చేసింది. ఉదయం మరీనా చెప్పింది అంటూ ఆమెపై గొడవకు దిగింది.

Advertisement
CJ Advs

తర్వాత మరీనా నువ్ గేమ్ అడవు కానీ, నన్ను మాత్రం అంటావ్ అంటూ మరీనాని కెలికింది. ఇక కెప్టెన్సీ టాస్క్ నుండి అవుట్ అయిన గీతు, ఆదిరెడ్డిలని బిగ్ బాస్ సంచాలక్ గా నియమించగా.. గీతు పెద్ద తోపులా నా రూల్స్ అంటూ బుట్ట మీద ఎవరూ చేతులు పెట్టి చేపలు కాపాడకూడదు, చేతులతోనే కాపాడుకోవాలనే రూల్ పెట్టగా.. దానిని రేవంత్, బాలాదిత్య, ఆఖరికి గీతు స్నేహితుడు ఆది రెడ్డి కూడా తప్పుబట్టారు. నీ తెలివి తేటలు ఇక్కడ ఉపయోగించకు అంటూ రేవంత్ ఫైర్ అయ్యాడు. ఇక గీతు సంచాలక్ గా ఉండి గేమ్ ఆడింది. దానికి ఆది రెడ్డి ఒప్పుకోలేదు. నా గేమ్ మధ్యలో ఎందుకొచ్చావ్ అంది గీతు. కానీ ఆది రెడ్డి ఇన్ని సీజన్స్ లో సంచాలక్ ఎవరూ ఆట ఆడలేదు. నేను ఆట ఆడలేదు ఆడిస్తున్నా అంటూ గీతు ఓవరేక్షన్ ఈ రోజు ప్రోమోలో కనిపించింది.  

Bigg Boss 6: A game riddled with rules and regulations:

Bigg Boss 6:mToday promo highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs