బిగ్ బాస్ సీజన్ 6 మొదలైనప్పటినుండి టైటిల్ ఫెవరెట్స్ గా కనబడుతున్న గీతు, రేవంత్ లు.. మధ్య మధ్యలో కలిసిపోయి బాగా మాట్లాడుకున్నప్పటికీ.. వారి మధ్యన ఏదో కోల్డ్ వార్ నడుస్తూనే వుంది. గీతు పని చెయ్యదని రేవంత్ ఆరోపిస్తూ ఉండడంతో నాగర్జున వీకెండ్ ఎపిసోడ్స్ లో గీతు ని స్టోర్ రూమ్ చుట్టూ తిప్పడం చేస్తున్నారు. ఇక గత రాత్రి నామినేషన్స్ లో రేవంత్ కి గీతుకి మధ్యన పెద్ద గొడవ జరిగింది. నువ్వు పెరుగు దొంగవి అంటే నువ్వు పని దొంగవి అంటూ వీర లెవల్లో గొడవ పడ్డారు. నీకన్నా నేను బెటర్ అంటే నీ కన్నా నేను బెటర్ అంటూ గొడవాడుకున్నారు.
ఇక ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో చాలామంది హౌస్ మేట్స్ గీతుని టార్గెట్ చేసారు. రోహిత్ తో, సూర్య తో గీతు బాగా గొడవపడింది. ఇక సంచాలక్ విషయంలో ఇనాయ.. సూర్య గొడవపడ్డారు. అయితే ఈ గేమ్ లో గీతు -అది రెడ్డి జంటగా ఆడుతున్నారు. రేవంత్ ని టాస్క్ లో ఎలాగైనా రెచ్చగొట్టాలని వారిద్దరూ ప్లాన్ చేసారు. టాస్క్ లో ఒకరినొకరు తోసుకునే క్రమంలో రేవంత్ గీతు ని తోసెయ్యగా.. గీతు రేవంత్ ని కాలు మీద తన్నిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి రేవంత్ అయితే అక్కడ గీతు తనని తన్నినందుకు గొడవపడి టైం వృధా చేసుకోకుండా వెళ్ళిపోయి తన గేమ్ తాను ఆడేసుకున్నారు.