ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్ అనే ప్రచారాస్త్రానికి, మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ మాటలకి, సమ్మోహితులైపోయి జగన్ ని అధికారంలో కి తీసుకొచ్చి చంద్ర బాబుకి కనీవినీ ఎరుగని షాక్ ఇచ్చారు. కానీ, కొన్నిరోజుల్లోనే జగన్ మాటలకి, చేతులకి పొంతన ఉండదని అర్థమైపోయింది. కానీ ఐదేళ్లు అధికారం అందించిన తర్వాత చేసేదేమిలేక ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అంటూ విధి వైపరీత్యాన్ని తిట్టుకుంటున్నారు. చంద్ర బాబుకి షాక్ ఇచ్చిన తమకి జగన్ ప్రతి నిముషం ఇచ్ఛే ఝలక్ లకి, విలవిలలాడుతున్నారు.
చంద్ర బాబు హైదరాబాద్ ని అభివృద్ద్ధి చేశానని, అమరావతి ని చేయడానికి సంకల్పించానని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో పెట్టుబడులు లేక, సంస్థలు తరలిపోవడంతో, జగన్ మాత్రం చెప్పుకోడానికి ఏమి మిగలలేదు. ఉన్న కొన్ని సంస్థలు, రాష్ట్రేతరులని నియమించుకోవడంతో, ఉద్యోగాలలో నియమిస్తుండటంతో, ఎందుకలా జరుగుతోందో అర్ధమవటంలేదు. కానీ జగన్ తాను అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఉచితం అని చెప్పడంతో, నిరుద్యోగ భృతి కూడా వస్తుండటంతో, రాష్ట్రంలోని యువకులు, సోమరులై ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపించడంలేదు. దాంతో ఉన్న కొద్దీ అవకాశాలు కూడా వేరేవారికి వెళ్లిపోతున్నాయి.
కొన్ని రోజుల తర్వాత రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అంధకారమైపోతే, జగన్ ఈ ఉచితాల అమలులో చేతులెత్తేస్తే, యువకుల భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే, జగన్ ని నమ్మితే అధః పాతాళమే గతి.