బిల్లా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తర్వాత ఎన్టీఆర్, వెంకీతో తో సినిమాలు చేసి చాన్నాళ్లు కనబడకుండా పోయిన మెహెర్ రమేష్ తర్వాత మహేష్ కాంపౌండ్ లో తేలాడు. మెహర్ రమేష్ మహేష్ తో సినిమా చేస్తాడేమో అనుకున్నారు. అంతలా వారితో కలిసి తిరిగాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో వేదాళం రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యి మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టాడు. చిరంజీవితో వేదాళం రీమేక్ భోళా శంకర్ అంటూ సెట్స్ మీద సందడి చేస్తున్నాడు. అయితే ఈ మధ్యనే మెహర్ రమేష్ తో శక్తి చేసి దెబ్బయిపోయాను, ఆ దెబ్బకి విజయవాడ వెళ్ళిపోయాను.. ఏదో రియల్ ఎస్టేట్ లో నిలదొక్కుని శక్తి ఇచ్చిన డిసాస్టర్ నుండి బయటపడ్డాను కానీ, లేదంటే మెహర్ రమేష్ దెబ్బకి ఏమైపోయేవాడినో అంటూ అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాజాగా ఈ వ్యాఖ్యలకి మెహర్ సమాధానం చెప్పినట్లే అనిపిస్తుంది. అంటే మెహెర్ రమేష్ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తి సినిమా ముందు వేరే అనుకున్నాం.. తర్వాత అశ్వినీ దత్ గారు ఇచ్చిన ఐడియా, ఆయన చెప్పినట్టుగా చేసాం. అలాగే హీరోకి నచ్చకుండా సినిమా చెయ్యలేం.. అశ్విని దత్ గారంటే మాకు గౌరవం.. ఆయనే ఏదైనా డివోషనల్ గా చేద్దామని.. దాంతో కొంతమంది రచయితలని పరిచయం చేసారు. అందరూ అంటే భారవి, యండమూరి వీరేంద్రనాథ్ ఇలా కొంతమంది వచ్చి కథలు చేబుతుంటే నేను అనుకున్న కథ పక్కదారి పడుతుందేమో అనిపించింది. కానీ దత్ గారు అమ్మవారిపై అదిరిపోతోంది అంటూ డబ్బు గురించి ఆలోచించొద్దు.. అంటూ ఆయన ఇష్టంతోనే శక్తి చేసాం. నేను చెప్పిన కథ బన్నీకి, వినాయక్ గారికి తెలుసు. ఏదో 25 కోట్ల బడ్జెట్ తో చేద్దామనుకున్నా కానీ.. దత్ గారి ఇష్టంతో ఆ సినిమా వచ్చింది.
ఏ సినిమాని ఎవ్వరైనా ఆడకూడదని ఎవ్వరూ చెయ్యరు. నాకు శక్తి స్టోరీ పెద్ద రచయితలు ఇచ్చారు, నేను మేకింగ్ చూసుకుంటాను, విజువల్ గా బావుంది.. కానీ వర్కౌట్ అవ్వలేదు. నేను, దత్ గారి డబ్బు, ఎన్టీఆర్ కష్టం అన్ని పెట్టాం కానీ శక్తి ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేదు అంటూ ఆ శక్తి డిసాస్టర్ అవడం తన చేతుల్లో లేదు అంటూ మెహెర్ చెప్పకనే చెప్పేసాడు.