Advertisement
Google Ads BL

బ్లాక్ బస్టర్ మూవీపై వివాదం


కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు, టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు పలువురు సెలబ్రిటీస్ కాంతార పై ప్రశంశలు కురిపిస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోయిజం, ఆయన డైరెక్షన్, కాంతార క్లైమాక్స్ అన్ని సినిమా ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. కన్నడలో తెరకెక్కిన కాంతార సినిమా కర్ణాటకలోని తుళునాడులో ఉన్న ఆచార, సంప్రదాయాల్ని చక్కగా చూపించింది. అదే భూతకోల సంప్రదాయం కాంతారకి ప్రాణం పోసింది అనే చెప్పాలి.

Advertisement
CJ Advs

క్లైమాక్స్‌లో కోల చెప్పే వ్యక్తిగా రిషబ్ శెట్టి తన నట విశ్వరూపం చూపించాడు. కోల చెప్పే సమయంలో వచ్చిన వరాహ రూపం సాంగ్ ప్రేక్షకుల హృదయాల్ని టచ్ చెయ్యడమే కాదు, థియేటర్స్ లో ఉర్రుతలూగించింది. సినిమాకి ఆ సాంగ్ హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పడు వరాహ రూపం సాంగ్ పై వివాదం రాజుకుంది. ఈ సాంగ్‌ని కాపీ కొట్టారంటూ తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేస్తుంది. తైక్కుడం బ్రిడ్జ్‌కి చెందిన సాంగ్ వరసని ఆ వరాహ రూపం సాంగ్‌ పోలి ఉందని.. ఇది కాపీరైట్ కిందకే వస్తుందని తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపిస్తోంది. తైక్కుడం బ్రిడ్జ్ ఈ విషయమై కాంతార టీమ్‌కి చట్టపరంగా నోటీసులు కూడా పంపబోతున్నట్ల గా చెప్పి షాకిచ్చింది.

Kantara lands in a huge controversy:

Kantara lands in legal trouble 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs