Advertisement
Google Ads BL

కదం తొక్కిన కాంతార..


ఒక సినిమాని అన్ని భాషల ప్రముఖులు ఏకధాటిగా పొగడం అనేది ఈమధ్యన వచ్చిన కాంతారకే సాధ్యమైంది. కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా మూవీ ఈ రోజు 250 కోట్ల మార్క్ ని దాటేసి అందరికి బిగ్ షాక్ ఇచ్చింది. కాంతారా కన్నడలో విడుదలైన 15 రోజుల్లో మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసినా.. అదే కనక వర్షం, అదే కాసుల పంట పండించింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం అన్నిటిని మించి చివరి 20 నిమిషాల కథే కాంతారని అందనంత ఎత్తులో నిలబెట్టింది. కాంతార ఇప్పుడు ఎలాంటి హిట్ అంటే.. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన వచ్చిన కె జి ఎఫ్ ని మరించేంత హిట్. 

Advertisement
CJ Advs

అతి తక్కువ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కాంతార చిత్రం కర్ణాటకలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. అంటే ఇది యశ్ క్రేజీ బ్లాక్ బస్టర్ కె జీ ఎఫ్ చాప్టర్ 2 తో సృష్టించబడిన అత్యధిక ఫుట్‌ఫాల్స్ రికార్డ్‌ను కాంతార అధిగమించింది. అటు కలెక్షన్స్ పరంగా అన్ని భాషల్లో కాంతార కదం తొక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ వారికి లాభాలే లాభాలు. గత వారం విడుదలైన సినిమాలతో పోటీగా ఇప్పటికి కాంతార కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉంది.

Kantara beats KGF2 footfalls at Karnataka:

Kantara breaks another record set by KGF 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs