Advertisement
Google Ads BL

ఫైనల్లీ పెళ్లి ఫొటోస్ ని బయటపెట్టిన పూర్ణ


సినిమాల్లో హీరోయిన్ గా పరిచయమై ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, బుల్లితెర పై జెడ్జ్ గాను కెరీర్ ని కొనసాగిస్తున్న నటి పూర్ణ పెళ్లి సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న న్యూస్. ఆమె మే నెలలో తన ప్రేమికుడు దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు షానిద్ ఆసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన పెళ్లి విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లుగా సైలెన్స్ ని మెయింటింగ్ చెయ్యడంతో.. పూర్ణ నిశ్చితార్ధం ఆగిపోయింది అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా పూర్ణ తన పెళ్లి ఫొటోస్ ని బయటపెట్టింది. సోమవారం దుబాయ్‌లో పూర్ణ వివాహం ఘనంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ పెళ్లి దుబాయ్, ముస్లిం ఆచార సాంప్రదాయాలతో జరిగింది. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా నిర్వహించారు.

Advertisement
CJ Advs

పెళ్లి ఫొటోస్ ని ఇన్స్టా లో షేర్ చేసిన పూర్ణ తన భర్త ఖాసీం ని పొగిడేస్తూ పెద్ద పోస్ట్ పెట్టింది. నేను ప్రపంచంలోనే అందమైన అమ్మాయిని కాకపోవచ్చు. అంతేకాకుండా మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సి లక్షణాలు నాలో లేకపోవచ్చు. కానీ మీరు మాత్రం నన్ను నేను నాకంటే తక్కువ అనుకునేలా ఏనాడు ప్రవర్తించలేదు. మీరు నన్ను చూసి ఇష్టపడి ఆరాధించారు. నన్ను మరమణలేదు, అలాగే మార్చడానికి ప్రయత్నించలేదు. నాలోని టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈరోజు సన్నిహితులు, దగ్గరైన వారి మధ్య మీరూ, నేను కలిసి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాం. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.. అంటూ పూర్ణ తన భర్తని పొగిడేస్తూ ఈ పోస్ట్ చేసింది.

Poorna gets married:

Poorna pens a heartwarming note for her husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs