Advertisement
Google Ads BL

పూరికి కోపమొచ్చింది


పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ తో బాగా దెబ్బతిని ఉన్నాడు. లైగర్ డిసాస్టర్ తో పూరి సైలెంట్ అయ్యాడు. పూరి సైలెంట్ అయినా.. ఆ సినిమా వలన నష్టపోయిన బయ్యర్లు ఊరుకోరుగా.. లైగర్ డిసాస్టర్ అయిన కొద్దిరోజులకే పూరి మీద పడ్డారు డిస్ట్రిబ్యూటర్స్. ఎంతోకొంత వెనక్కి ఇస్తాను, నష్టాలు పూడుస్తాను అంటూ పూరి జగన్నాధ్ వాళ్లతో సెటిల్మెంట్ కుదుర్చుకున్నాడు. దాని కోసం పూరి ఓ నెల టైమ్ తీసుకున్నాడు. కానీ కొంతమంది బయ్యర్లు ఈ నెల 27 న పూరి పై దండయాత్రకు బయలుదేరుదామని అనుకోవడమే కాదు, పూరి కి వార్నింగ్ కూడా ఇవ్వడంతో పూరికి మండిపోయింది. అసలే మాస్ అండ్ మెంటల్ డైరెక్టర్.. దానితో పూరి సదరు ఎగ్జిబ్యూటర్స్ కి ఇచ్చిన వార్నింగ్ టోన్ ఆడియో ఒకటి లీకైంది.

Advertisement
CJ Advs

ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.. నేను ఎవరికీ డబ్బులు తిరిగి అవ్వాల్సిన అవసరమే లేదు. అయినా మీరు నష్టపోయిన కారణంగా వెనక్కి ఇస్తున్నాను, ఎప్పుడో బయ్యర్లకి ఒక ఎమౌంట్ ఇస్తామని సెటిల్ చేసి నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయి.. ఒక నెల టైమ్ ఇవ్వమని అడిగాను. అయినా కూడా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధికాదు. పరువు పోకూడదనే ఉద్దేశ్యంతో డబ్బులు తిరిగి ఇస్తున్నా.. కానీ ఇలా పరువు తియ్యాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వను, అసలు ఎగ్జిబిటర్లకు నాకు సంబంధమేంటి.. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం, పేకాడ ఆడుతున్నాం. కొన్ని సార్లు డబ్బులు ఆటల్లో పోతాయి. పోతే నేను ఎవరినైనా అడుగుతున్నానా, అదే సినిమా హిట్ అయితే బయ్యర్ల దగ్గర వసూలు చేయడానికి నానా సంకలు నాకాలి నేను. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి. వాటిని బయ్యర్స్ అసోసియేషన్ వసూలు చేసి పెడతుందా.. అంటూ పూరి జగన్నాథ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఆడియో లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Puri Jagannadh Sensational Comments About Liger Buyers:

Puri Jagannadh Warning To Liger Buyers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs