Advertisement
Google Ads BL

సత్య కోసం కన్నీళ్లు పెట్టుకున్న అర్జున్


నేను బిగ్ బాస్ కి వెళ్ళిందే శ్రీ సత్య కోసం అంటూ బిగ్ బాస్ స్టేజ్ పై అందరి ముందు చెప్పిన అర్జున కళ్యాణ్.. శ్రీ సత్య తన కోసం కన్నీళ్లు పెట్టుకోవడం చూసి స్టేజ్ పై చిన్నపిల్లాడిలా ఏడ్చిన సీన్ గత రాత్రి అర్జున్ ఎలిమినేషన్స్ లో చూసాం. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కి ఎంటర్ అయినప్పటినుండి సత్యకి లైన్ వేస్తూ కనిపించాడు.. ఆట మీద కన్నా సత్య మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినా ఆమె మాత్రం అర్జున్ ని పట్టించుకోలేదు.

Advertisement
CJ Advs

అర్జున్ కళ్యాణ్ కి సత్య లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వకపోవడం, రేవంత్ తో తగాదాలు.. అలాగే వీక్ కంటెస్టెంట్ గా ప్రొజెక్ట్ అవడం, అందరితో మింగిల్ అవ్వలేకపోవడంతో అర్జున్ కళ్యాణ్ ఏడో వారం ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయ్యి నాగార్జున పక్కన నిలబడిన అర్జున్ కళ్యాణ్ టాప్ 5 లో శ్రీహన్, శ్రీసత్య, రేవంత్, గీతు, సూర్య ఉంటారని చెప్పాడు. అర్జున్ ఎలిమినేట్ అవడంతో శ్రీసత్య మొదటిసారి హౌస్ లో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అర్జున్ ని స్టేజ్ పై చూసిన శ్రీసత్య కన్నీళ్లు పెట్టుకోగా.. అర్జున్ కూడా కంటతడి పెట్టేసి ప్లీజ్ ఏడవకు అన్నాడు. నాగార్జునతో మీతో చెబుతున్నా సర్.. శ్రీ సత్య నాకు మంచి ఫ్రెండ్.. ఆమెకి నేను సినిమా ఆఫర్ ఇస్తే.. నేను బిగ్ బాస్ కి వెళుతున్నా అని చెప్పింది. దానితో నేను అప్లై చేసుకుని ఆమె కోసమే బిగ్ బాస్ కి వచ్చాను అని చెప్పడంతో కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, శ్రీసత్య కూడా షాకయ్యింది.

Arjun Kalyan Comments On Sri Satya :

Arjun Kalyan Comments On Sri Satya After Coming of Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs