అఖిల్ ఏజెంట్ పై సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న ఏజెంట్ స్పై థ్రిల్లర్ గా రాబోతుంది. అయితే ఎప్పుడో ఆగష్టు లోనే ఏజెంట్ విడుదల అంటూ మేకర్స్ డేట్ ఇవ్వడం, తర్వాత చది చప్పుడు లేకుండా డేట్ మారినా.. ఏజెంట్ నుండి అప్ డేట్ లేకపోవడంతో.. ఆ సినిమా విషయంలో వినిపిస్తున్న గాసిప్స్ నిజమయ్యేలా కనిపించాయి. ఈలోపు ఏజెంట్ డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది అన్నారు.
కానీ దివాళీ రోజున అఖిల్ ఏజెంట్ లుక్ ని వదులుతూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. రిలీజ్ డేట్ పర్టిక్యులర్ గా ఇవ్వకపోయినా.. సంక్రాంతి కి రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్, అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఏజెంట్ సంక్రాంతి కి అని చెప్పగానే.. అందరూ అమ్మో సీనియర్ హీరోలు బాలయ్య- చిరు లకి పోటీగానా.. అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ వారసుడు చిత్రాలను కూడా ఏజెంట్ ఢీ కొట్టబోతుంది. సినిమాలో ఎంత దమ్ము లేకపోతే ఇలా సంక్రాంతి బరిలో బిగ్ ఫైట్ కి సిద్ధం కారు కదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఏజెంట్ లుక్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కొత్తగా కనిపించగా.. దివాళీ పోస్టర్ లో కాస్త కొత్తగా రా ఏజెంట్ గా కనిపించాడు.