Advertisement
Google Ads BL

పూనకాలు పుట్టించేలా వాల్తేర్ వీరయ్య టీజర్


దీపావళి వేడుకలను మరింత దేదీప్యమానంగా మార్చేలా.. తన అభిమానులకు పూర్వకాలం పూనకాలు మళ్ళీ వచ్చేలా మాస్ మూలవిరాట్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య లుక్ లో నేడు దర్శనమిచ్చారు. బాబీ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రానున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ MEGA 154 కు వాల్తేర్ వీరయ్య టైటిల్ ని కన్ ఫర్మ్ చేస్తూ నేటి (24-10-2022) ఉదయం టీజర్ వచ్చేసింది.. మాంచి ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చేసింది. ఇక ఈ మెగా టీజర్ మ్యాటర్ ఏంటంటే... 

Advertisement
CJ Advs

ఏంట్రా.. వాడొస్తే పూనకాలన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఏడిరా మీ అన్నయ్య, సౌండే లేదు అని ఓ పొగరెక్కిన పోట్లగిత్త నోరు జారగానే అగ్ని పర్వతమే కదిలి వస్తున్నట్టుగా దద్దరిల్లే శబ్దంతో వాళ్లందరికీ వాల్తేర్ వీరయ్య వైబ్రేషన్ తగిలింది. అక్కడ జరగాల్సిన విధ్వంసం జరిగింది. కానీ మెగాస్టార్ మాత్రం దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి చిత్రాల నాటి చిలిపి మాసిజంని తనకే సొంతమైన శైలిలో ప్రదర్శిస్తూ నోట్లో బీడిని అలవోకగా అటు ఇటు కదపడం చూస్తుంటే సంక్రాంతికి థియేటర్స్ లో  ప్రేక్షకులకి పులకరింతలు, అభిమానులకి పూనకాలు తధ్యం అనిపించింది.

అందులోనూ ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ ధమాకాలు ఇంకా చూడాలి అనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అంటూ చిరు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నట్టుగా చెప్పిన ట్రెండీ డైలాగ్ అయితే ముందు ముందు వీరయ్య ట్రెమండస్ మాస్ హిస్టీరియా ఎలా ఉండబోతుందో ఉదాహరణగా నిలిచింది. ఇక టీజర్ ఫినిషింగ్ లో కాలే కట్టెను చేతబట్టి బీడీ వెలిగించుకుని మెగాస్టార్ నడిచే షాట్ ఆయన్ని ఎందుకు అందరు మాస్ మూల విరాట్ అంటారో ప్రూవ్ చేసే రేంజ్ లో ఉంది. డైరెక్టర్ బాబీ బ్లాస్టింగ్ టీజర్ కట్ రెడీ చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో వీరయ్యా... అంటూ అదరగొట్టేసాడు దేవిశ్రీ ప్రసాద్. 

సంక్రాంతి సంచలనాలకు టీజర్ తోనే శ్రీకారం చుట్టేసిన ఈ వాల్కనో వాల్తేర్ వీరయ్య గురించిన మరిన్ని విశేషాలతో ముందు ముందు చాలా అప్ డేట్స్ ఉంటాయి. ముందైతే హ్యాపీ దీవాళీ.. తొందర్లోనే కలుద్దాం అని వినిపించిన రవితేజ మాటతో సహా ఈ మెగా మాస్ ట్రీట్ వాల్తేర్ వీరయ్య టీజర్ ని ఎంజాయ్ చేసెయ్యండి.!

Watch Waltair Veerayya Teaser

 

 

Chiranjeevi Waltair Veerayya Teaser Arrived:

Megastar Chiranjeevi Waltair Veerayya Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs