హీరో నితిన్ నుండి దీపావళి డబల్ ధమాకా రాబోతోందా, అంటే అవుననే అంటున్నారు సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం నితిన్ తన క్రొత్త చిత్రాలని అంగీకరించడానికి దర్శకుల నుండి కథలు వింటున్నాడు. నితిన్ ఈ మధ్యనే మాచర్లనియోజకవర్గం చిత్రంలో నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం, అంచనాలు అందుకోలేకపోయింది. భీష్మ చిత్రంతో ఘనవిజయం సాధించిన నితిన్, ఆ తర్వాత వెనుకపడిపోయాడు. చెక్, రంగ్ దే ,మాస్ట్రో అతనికి నిరాశనే మిగిల్చాయి.
ఇలాంటి సమయంలో నితిన్ అభిమానులు తమ హీరో సంతోషకరమైన వార్తలు ఏమి వివరిస్తాడా అని ఆలోచిస్తున్నారు. నితిన్ తన గర్ల్ ఫ్రెండ్ షాలిని కందుకూరి ని 2020 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే షాలిని గర్భవతి అని, నితిన్ తండ్రి కాబోతున్నాడని. ఈ శుభవార్తని అభిమానులతో పంచుకోనున్నాడని తెలుస్తోంది.
ఇదే కాకుండా, నితిన్ ఎప్పటినుంచో తన కోసం ఒక అందమైన ఇల్లు కావాలని కలలు కన్నాడు. అవి కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయని తెలుస్తోంది. తన అభిరుచికి తగ్గట్టు నిర్మించుకుంటున్న ఇల్లు నివసించడానికి సిద్ధం అయ్యింది. ఈ విషయంకూడా అభిమానులతో పంచుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ రెండు విషయాలు బయటకి రావడంతో, నితిన్ ఎప్పుడెప్పుడు ఈ విషయాలని అధికారికంగా గా వెల్లడిస్తాడా, తమ శుభాకాంక్షలు ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.