అక్టోబర్ 23 అర్ధరాత్రి 12 గంటల నుండే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా బిల్లా రీ రిలీజ్, ఆయన నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ నుండి అప్ డేట్స్ తో సోషల్ మీడియా మోత మోగిపోతుంది. ఆదిపురుష్ నుండి స్పెషల్ పోస్టర్, ప్రాజెక్ట్ K నుండి ఓ పోస్టర్ తో ప్రభాస్ ఫాన్స్ కి ట్రీట్స్ అందగా.. సలార్ నుండి ఏ గ్లిమ్పో, లేదంటే పోస్టర్ ఎమన్నా వస్తుంది అని ప్రభాస్ ఫాన్స్ చాలా ఎదురు చూసారు. అయితే సలార్ నుండి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ప్రభాస్ సలార్ వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేసారు. ఇంతకుముందు ఫస్ట్ లుక్ లోనే ప్రభాస్ మాస్ గా చూసేసారు ఫాన్స్, మధ్యలో లీకైన పిక్స్ కూడా ఇంచుమించు ఈ రోజు బర్త్ డే రోజు వదిలిన పిక్స్ లాగే ఉన్నాయి.
ఇక సలార్ టీజర్ ని అయినా, లేదంటే సలార్ గ్లిమ్స్ అయినా ఎక్స్పెక్ట్ చేసిన ఫాన్స్ కేవలం ఈ వర్కింగ్ స్టిల్స్ తో సరిపెట్టుకున్నారు. ఈలోపు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా సలార్ సెట్స్ లో ప్రభాస్ తో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్న పిక్ తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి Happy birthday Darling! Have a great year and we will try our best in making this year extra special for you. అంటూ ట్వీట్ చేసాడు. అయితే ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ బర్త్ డే రోజున అదే డ్రెస్సెస్ లో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ నీల్ ని విష్ చేసాడు... ఆ పిక్ ని చూసిన ప్రభాస్ ఫాన్స్ ఎగ్జైట్ అయ్యారు. కానీ టీజర్ విషయంలో కాస్త గొణుగుతూనే ఉన్నారు వాళ్ళు.