Advertisement
Google Ads BL

అందుకే పెళ్ళికి పిలవలేదంటున్న పూర్ణ


నటి పూర్ణ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా బుల్లితెర మీద మాత్రం తరచూ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. కామెడీ స్టార్స్, ఢీ డాన్స్ షో లలో జేడ్జ్ గా పూర్ణ.. అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్ లో స్పెషల్ డాన్స్ లతో హైలెట్ అవుతుంది. అలాగే సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాబు సత్తా చాటుతుంది. అయితే ఈమధ్యన పూర్ణ తన పెళ్లి విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ప్రేమికుడు అసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చాలారోజులైనా పెళ్లి విషయం చెప్పకపోయేసరికి ఆమె ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యింది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఈమధ్యన తాను ప్రేమ పేరుతొ ఒక ముఠా చేతిలో మోసపోయానంటూ చెప్పి షాకివ్వడంతో ఆమె పెళ్లి ఆగిపోయింది అనే అనుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా పూర్ణ తమ పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది అని, పెళ్ళికి అందరిని ఎందుకు పిలవలేదో చెప్పింది. పూర్ణ బాయ్ ఫ్రెండ్ అసిఫ్ అలీ దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్. అతనితో పూర్ణ ఫ్యామిలీకి పరిచయం ఉండడంతో ఇరువురు ప్రేమలో పడి వివాహానికి రెడీ అయ్యారు. అయితే పూర్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసిఫ్ తో తన నిశ్చితార్ధం మే 31 న జరిగింది అని, జూన్ 12 న తమ పెళ్లి దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్యన  వైభవంగా జరిగింది అని, అయితే దేశ సమస్య దృష్ట్యా ఎవరిని పిలవలేదని, అలాగే ఎవరూ పెళ్ళికి రాలకేపోయారని చెప్పిన పూర్ణ త్వరలోనే కేరళలో తమ పెళ్లి రిసెప్షన్ ఉండబోతున్నట్టుగా చెప్పుకొచ్చింది.

Poorna Gets Married:

Poorna: In view of the country's problem, no one was invited to the wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs