Advertisement
Google Ads BL

ప్రభాస్ సంచలన నిర్ణయం


పాన్ ఇండియా స్టార్ గా  ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులని స్వంతం చేసుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి అవతారంలో తన నటవిశ్వరూపం చూపించి అందరిని మైమరపించాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, అది పురుష్ మరియు మారుతి దర్శకత్వంలో ఒక చిత్రం లో నటిస్తున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 అని అందరికీ తెలిసినదే. ప్రపంచంలోని అతని అభిమానులందరూ ప్రభాస్ జన్మ దినాన్ని ఒక పండగలాగా జరుపుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇదే సమయంలో ప్రభాస్ చిత్ర నిర్మాతలు అంతా  ప్రభాస్ అభిమానులని అలరించడానికి, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, అది పురుష్ మున్నగు వాటినుండి ఆశ్చర్యకరమైన విషయాలని వెల్లడించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన జన్మ దిన సంబరాల పై సంచలన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాడట.

ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఈ మధ్యనే స్వర్గస్తులయ్యారు. ప్రభాస్ తన పెద్దనాన్న ని ఎంతగానో ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు. ఈ బాధాకర సమయంలో తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సరికాదని ప్రభాస్ ఆలోచనగా తెలుస్తుంది. అందుకనే ఈ ఏడాది ప్రభాస్ తన జన్మదిన వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు.  అభిమానులు ప్రభాస్ నిర్ణయంతో కొంచెం బాధపడినా, ప్రభాస్ మనసుని అర్థం చేసుకుని సరిపెట్టుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు తమలో తామే ప్రభాస్ పుట్టినరోజుని అంగరంగవైభవంగా జరుపుకొని తమ అభిమాన నటునిమీద ప్రేమ చూపించుకోవాలని నిశ్చయించుకున్నారు.

Prabhas sensational decision:

Prabhas To Skip Birthday Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs