Advertisement
Google Ads BL

ప్రభాస్ ధైర్యే సాహసే


యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి చిత్రం పై ఆయన అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రభాస్ మారుతి తో చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నదని తెలిసిన వెంటనే, అభిమానులు ఈ చిత్రం చేయవద్దు అంటూ నిరసనలు తెలియచేసారు. కానీ ప్రభాస్ వారినందరిని కాదని, మారుతి తో చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యాడు. ప్రభాస్ అభిమానులు, ఈ చిత్రం తమ పాలిట కాళరాత్రి కాకూడదని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నారు. ఎందుకంటే మారుతి ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్ గా మలచాలని ప్రయత్నిస్తూ, ప్రభాస్ ని దెయ్యం ఆవహిస్తే ఎలా ప్రవర్తిస్తాడో అలా చూపిస్తూ, అందులో హాస్యాన్ని మేళవిస్తూ అందరిని అలరించడానికి సిద్దమవుతున్నాడు.

Advertisement
CJ Advs

ఇప్పుడు వస్తున్న  సమాచారం ప్రకారం, ప్రభాస్ అభిమానుల భయాన్ని కాలదన్ని, ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ప్రభాస్ ఇప్పటికే టెస్ట్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ టెస్ట్ షూట్ కోసం ప్రభాస్ 3-4 రోజులు కేటాయించాడు. మారుతి ప్రభాస్ ని మునుపెన్నడూ లేని విధంగా చూపించి అభిమానుల భయాలని పారద్రోలాలని నిర్ణయించుకున్నాడు. ప్రభాస్ కూడా ప్రతి నెలా కొద్దిరోజులపాటు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొని త్వరితగతిన ముగించాలని చూస్తున్నాడు.

Prabhas-Maruthi film test shoot on:

Prabhas kickstarts test shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs