ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా ఎంటెర్టైమెంట్ రంగంలో జరుగుతున్న పరిణామాల పై సర్వే చేసి అవి ప్రజల ముందు ఉంచుతుంది. క్రొత్తగా ఆ సంస్థ నుంచి వచ్చిన సర్వే ప్రకారం దేశమంతా పుష్ప 2 ఫీవర్ లో ఉంది. ఆర్మాక్స్ సంస్థ అక్టోబర్ 15 న ప్రజలు ఏ చిత్రానికి ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్నారోనని దేశవ్యాప్తంగా సర్వే చేసారు. ఆ సర్వే ఫలితాల ప్రకారం అల్లు అర్జున్ పుష్పా ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత షారుఖ్ ఖాన్ యొక్క పఠాన్, సల్మాన్ ఖాన్ యొక్క టైగర్ మరియు షారుఖ్ ఖాన్ యొక్క జవాన్, డుంకీ నిలిచాయి. అల్లు అర్జున్ పుష్పా ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అయినప్పటికీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చిత్రాలు పఠాన్, జవాన్ మరియు డుంకీ మొదటి స్థానాలలో నిలిచాయంటే, షా రుఖ్ ఖాన్ పేరు ప్రఖ్యాతలు తెలియపరుస్తోంది.
మొత్తంగా చూస్తే, ఉత్తరాది సినీ ప్రేమికులలో బాలీవుడ్‌పై సౌత్ సినిమాల పట్టును మరోసారి ఈ సర్వే చూపించింది. పుష్ప ది రైజ్ చిత్రం అనూహ్య విజయంతో, చిత్ర దర్శక నిర్మాతలు, పుష్ప ది రూల్ కి మరింత హంగులు జోడించి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలవుతుంది.