దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదైనా వివాదం వస్తే వెంటనే వాలిపోయి తన పంధాలో చెలరేగుతాడు. వివాదాలు లేకపోతే తానే సృష్టించి సంచలనాలు సృష్టిస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జన సేన అధ్యక్షుడిగా రెండురోజల క్రింద తన మాటల తూటాలతో ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేసాడు. ఆ రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు.
ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ, పవన్ కళ్యాణ్ పై తనదైన పంచ్ లు వేసాడు. తన అభిప్రాయాలని తెలుపుతూ, రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పాడు. దాని యొక్క నీతి కొన్ని అంతర్గత వృత్తాలలో అంతర్లీనంగా చూడవచ్చు కానీ @పవన్ కళ్యాణ్ గత 100 సంవత్సరాలలో నేను విన్న అత్యంత ప్రభావవంతమైన అద్భుతమైన ప్రసంగం అని ట్వీట్ చేసాడు.
అంతేకాకుండా విట్రియోలిక్ వాక్చాతుర్యం అనేది ఎల్లప్పుడూ ప్రజలను కదిలించేది మరియు@పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేది గుండెల్లోకి చొచ్చుకుపోయేలా దూసుకుపోయిన బాణం ఈ ప్రసంగం అంటూ చేసిన ట్వీట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో, ఎవరిని తెగుడుతాడో ఆయనకే తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆంద్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్తోంది. మరి పవన్ కళ్యాణ్ పూరించిన యుద్ధ శంఖారావానికి ఎవరు ఎటువైపు కదులుతారో వేచి చూడాలి.