Advertisement
Google Ads BL

జగన్ అస్త్రాలు-మూడు పెళ్లిళ్లు, వెన్నుపోటు


ప్రపంచంలోని తెలుగువారంతా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. జగన్ అస్త్రాలు, మూడు పెళ్లిళ్లు , వెన్నుపోటు తప్ప ఇంకేవి లేవని ఎకసెక్కాలాడుతున్నారు. ఎవరైనా తమ గొప్పలు తాము చెప్పుకుంటారు, ఎదుటివారి గురించి పట్టించుకోకుండా. సమర్థులైనవారు తమ పని తాము చేసుకుపోతుంటారు. కానీ జగన్ లాంటి వారే తమ గురించి చెప్పుకోడానికి ఏమిలేకపోతే, ఎదుటివారిపై ఆరోపణలు చెయ్యడమే.

Advertisement
CJ Advs

అందుకే, ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రత్యర్థుల మీద చిల్లర ఆరోపణలు చేస్తుంటారు. ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి ఆరోపణలు విని ప్రజలు విసిగి వేసారిపోయినా, అవే  మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. తమ పరిపాలనలో ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అనేదే చూస్తారని తెలిసినా, జగన్ అవేమీ పట్టించుకోకుండా, ప్రత్యర్థుల పై వ్యక్తిగత దూషణలు చేస్తుంటారు.

అలాంటివే, జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు. ప్రతి నిత్యం, పవన్ మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటూ దెప్పి పొడుస్తాడు. అలానే చంద్రబాబు వెన్నుపోటు బాబు అని ఆరోపిస్తుంటాడు. జగన్ తన అస్త్రాలు పదును తగ్గిపోయిందని ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే అంత మంచిది. కానీ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు, జగన్ అధికారా మదంతో మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి మదించిన ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు.

An influential person hiding the atrocities of Jagan:

CM Jagan Stires on Pawan Kalyan 3 Marriages
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs