Advertisement
Google Ads BL

బాలీవుడ్ పై బాలకృష్ణ దండయాత్ర


నటసింహం బాలకృష్ణ ఉత్కంఠభరిత యాక్షన్ చిత్రాలకు మారుపేరు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో, వీరావేశంతో వెండితెరపై అందరినీ అలరిస్తాడు. బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో అశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. కరోనా తర్వాత వచ్చిన ఈ చిత్రం, బాలకృష్ణ మొండి ధైర్యంతో, తక్కువ టికెట్ ధరలకే థియేటర్లలో విడుదలచేసిన, ఈ చిత్రం అఖండ విజయం సాధించింది.  ఇతర భాషలవాళ్ళు కూడా ఈ చిత్రాన్ని చూసి, ముఖ్యంగా హిందీ లో విడుదల చేయాల్సిందని అనుకున్నారు. అఘోరాగా బాలకృష్ణ నట విశ్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ బాలీవుడ్ పై దండయాత్రకి తయారవవుతున్నాడు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. బాలకృష్ణ సరసన శృతి హాసన్ మరియు ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మరియు చంద్రిక రవి, హని రోజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పేరుని అంగరంగ వైభవంగా కొండారెడ్డి బురుజు పై అక్టోబర్ 21 న ప్రకటించబోతున్నారు. ఈ చిత్రానికి వీర శంకర్ రెడ్డి అనే పేరుని ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఈ చిత్రం తర్వాత, బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్సకత్వంలో నటిసున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభియయం చేస్తున్నాడు. ఒక పాత్రలో తండ్రి గా నటిస్తుండగా, ఆయన కి శ్రీలీల కూతురిగా నటిస్తోంది. అనిల్ రావిపూడి బాలకృష్ణని ఎన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడు. చిత్ర నిర్మాతలు, ఈ చిత్రాన్ని తెలుగు లోనే కాకుండా, హిందీ మరియు ఇతరభాషలలో విడుదలకి సిద్ధం అవుతున్నారు. బాలకృష్ణ అభిమానులు తమ హీరో బాలీవుడ్లో ప్రతాపం చూపించాలని ఆశ పడుతున్నారు.

Balakrishna gunning for Bollywood:

Balakrishna is planning a Bollywood attack
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs