దసరా రోజు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ కి ఆడియన్స్ కూడా రెడ్ కార్పెట్ పరిచారు. చిరంజీవి ని గాడ్ ఫాదర్ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యడంతో సినిమాకి సూపర్ హిట్ టాక్ పడింది. కానీ 90 కోట్ల టార్గెట్ ని అందుకోవడంతో గాడ్ ఫాదర్ తడబడింది. మొదటి వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన గాడ్ ఫాదర్ రెండో వారం చిన్న చిన్న సినిమాలు విడుదలైనా.. అవి అంతగా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయకపోవడంతో..గాడ్ ఫాదర్ కి కలిసొస్తుంది అనుకునేలోపు అల్లు అరవింద్ కన్నడ కాంతారని గాడ్ ఫాదర్ మీదకి వదిలాడు. కన్నడలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన కాంతారని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చెయ్యడంతో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ కి గండి పడింది. కాంతారాకు టాక్ బావుండడంతో.. కలెక్షన్స్ పెరగడమే కాదు, గాడ్ ఫాదర్ ని కూడా కాంతారకి అలార్ట్ చెయ్యడంతో.. గాడ్ ఫాదర్ కి దెబ్బపడింది.
మరి గాడ్ ఫాదర్ కూడా మెగా మూవీ నే. అల్లు రవీంద్ కి చిరుకి స్నేహం ఉంది. కానీ అల్లు అరవింద్ ఓ వారం ఆగి కాంతారని రిలీజ్ చేస్తే గాడ్ ఫాదర్ ఎంతోకొంత సేవ్ అయ్యేది. ఇప్పుడు బయ్యర్లకి కొద్దిగా లాస్ తప్పేలా లేవు. కాంతారా వచ్చి గాడ్ ఫాదర్ ని పడుకోబెట్టేసింది. కాంతారకి అంతకంతకు కలెక్షన్స్ పెరగడం, గాడ్ ఫాదర్ కి కలెక్షన్స్ తగ్గిపోవడం జరిగింది. దీనిని చూసిన నెటిజెన్స్ అరవింద్ ఆలోచించాల్సింది, కాంతారా రిలీజ్ ఓ వారం ఆపాల్సింది.. గాడ్ ఫాదర్ మెడపై కాంతార కత్తి ని తగిలించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.