యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో జపాన్ లో ఉన్నారు. రీసెంట్ గానే ఆయన తన భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో జపాన్ వెళ్లారు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్-చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ ని జపాన్ లో ఈ నెల 21 న విడుదల చేస్తుండడంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అయితే జపాన్ హోటల్ లో దిగిన ఎన్టీఆర్ కి అక్కడి స్టాఫ్ ఇచ్చిన సర్ ప్రైజ్ చూస్తే జపాన్ లో కూడా ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా అంటారు.
ఎన్టీఆర్ స్టే చేసిన హోటల్లో ఓ లేడీ ఫ్యాన్ ఎన్టీఆర్ కోసం ఓ బ్యూటిఫుల్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ లెటర్ మెసేజ్ ని తీసుకున్న ఎన్టీఆర్ ఆమెతో మాట్లాడుతూ.. అది చేసింది మీరేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చెయ్యడం, ఎన్టీఆర్ తో మాట్లాడే సందర్భంలో తన ఎగ్జైట్మెంట్ కూడా ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ మా ఎన్టీఆర్ అన్నకి ఎక్కడ చూసినా ఫాన్స్.. అందుకే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.