ప్రపంచమంతా రాజమౌళి తదుపరి చిత్రం పై దృష్టి సారించారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ విశ్వవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేయడంతో, సినీప్రియులు రాజమౌళి తర్వాత చిత్రం పై ఊహాగానాలు ప్రారంభించారు. రాజమౌళి తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే రాజమౌళి మాటలతో, ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రాజమౌళి మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రపంచ ప్రజలందరినీ విస్మయపరుస్తుందని అనడంతో అందరు ఉత్సుకత చూపిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం, ఈ చిత్రంలో హీరోయిన్ గా అగ్ర తార దీపికా పడుకొనే ని తీసుకొంటున్నట్టు కథనాలు వచ్చాయి. మహేష్ బాబు అభిమానులు ఆందందడోలికలలో తేలుతుండగానే, అంతకంటే ఆశ్చర్యకరమైన, విషయం బయటకి వస్తోంది. దాని ప్రకారం రాజమౌళి ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ఒక అగ్ర హాలీవుడ్ తారని తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ ప్రక్కన హాలీవుడ్ తార అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి.
కానీ ప్రస్తుతం రాజమౌళి, ఆర్.ఆర్. ఆర్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ ఆ చిత్రానికి ఆస్కార్ నామినేషన్ వచ్చేట్టు అటుపై ఆస్కార్ వచ్చేట్టు పాటు పడుతున్నాడు. అదే సమయంలో మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు పూజ హెగ్డేతో తో రొమాన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ ముగిసిన తర్వాతే రాజమౌళి-మహేష్ బాబు చిత్రం పై మరింత స్పష్టత వస్తుంది.