Advertisement
Google Ads BL

అశ్లీల ఫొటోలపై విష్ణుప్రియ స్పందనిదే!


విష్ణుప్రియ.. బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్. నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎంత తాపత్రయపడుతుందో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి తెలుసు. అందాల ఆరబోతతో పాటు.. డ్యాన్సింగ్ టాలెంట్‌ను కూడా ప్రదర్శిస్తూ.. అవకాశాల కోసం వేచి చూస్తుంది. మరి ఇలాంటి టైమ్‌లో ఆమెకు అనుకోని ఝలక్ తగిలింది. ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. ఇప్పటికే ఓ సారి హ్యాక్ అయిందని, మళ్లీ మరోసారి హ్యాక్ అయినట్లుగా తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వెల్లడించింది. సడెన్‌గా ఆమె ఇలా వీడియో పోస్ట్ చేయడం వెనుక కారణం ఏమిటని అనుకుంటున్నారా? మంగళవారం ఆమె ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫొటోలు పోస్ట్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

 

విష్ణుప్రియ బ్యాక్ చూపిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలలో ఆమె న్యూడ్‌గా దర్శనమిస్తోంది. ఆమె ఫొటోలే కాదు.. ఫేస్ మార్ఫింగ్‌తో మరికొందరి ఫొటోలు కూడా పోస్ట్ అయ్యాయి. ముందు విష్ణుప్రియ న్యూడ్ ఫొటోలు చూసిన వారంతా.. ఆమెపై ఫైర్ అయితే.. తర్వాత పోస్ట్ అయిన ఫొటోలు చూసి.. ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లుగా భావించారు. ఇక ఈ అశ్లీల ఫొటోలపై తాజాగా విష్ణుప్రియ కూడా స్పందించింది. ‘‘నా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. రెండు నెలల నుండి మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాను. ఇంకా నాకు అది రాలేదు. ఇప్పటికి రెండు సార్లు నా అకౌంట్ హ్యాక్ అయింది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఆ పేజీపై రిపోర్ట్ చేసి.. అన్‌ఫాలో చేయండి. అందరూ నన్ను క్షమించండి. దయచేసి ఈ మెసేజ్‌ను అందరికీ షేర్ చేయగలరు’’ అని విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వేడుకుంది.

Anchor Vishnu Priya Reacted on Facebook Vulgar content:

Anchor Vishnu Priya Facebook Account Hacked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs