Advertisement
Google Ads BL

NBK107 టైటిల్ లీకెడ్


నందమూరి బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న NBK107 అప్ డేట్స్ నందమూరి ఫాన్స్ కి కునుకు రానివ్వడం లేదు. ఇప్పటికే బాలయ్య బర్త్ డే కి విడుదలైన టీజర్, NBK107 ఫస్ట్ లుక్ మాస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాయి. యాక్షన్ ప్రియులని ఉర్రుతలూగించాయి. దానితో ఈ సినిమాకి గోపీచంద్ మలినేని పెట్టబోయే టైటిల్ పై అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అయితే బాలయ్య NBK107 టైటిల్ రేపు శుక్రవారం రాత్రి 8 గంటలకి కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర వేలాదిమంది అభిమానుల నడుమ రివీల్ చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా NBK107 టైటిల్ లీకైనట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణని వీర సింహ రెడ్డిగా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే NBK107 కి పవర్ ఫుల్ టైటిల్ గా వీర సింహ రెడ్డి ని పెట్టినట్లుగా సమాచారం. రేపు 21 న అభిమానుల మద్యన ఇదే టైటిల్ ని గోపీచంద్ మలినేని రివీల్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రం లో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపిస్తుంది. ఇక ఈమధ్యనే గాడ్ ఫాదర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అఖండతో బాలయ్య-థమన్ కాంబో కి విపరీతమైన క్రేజ్ రావడంతో.. మరోసారి ఈ మూవీకి థమన్ మ్యూజిక్ రిపీట్ అవడంతో.. NBK107 పై క్రేజ్ మరింతగా పెరిగింది.

NBK107 title leaked :

NBK107 Title Launch At Konda Reddy Buruju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs