Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: గీతు-ఆదిరెడ్డికి పనిష్మెంట్


బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ పై బిగ్ బాస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చెయ్యడమే కాదు, హౌస్ మేట్స్ ని ఆకలితో మాడ్చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ లో బిగ్ బాస్ మాకు ఆకలి వేస్తుంది.. ప్లీజ్ మాకు ఫుడ్ కావాలి అంటూ హౌస్ మేట్స్ అంతా నీరసపడిపోతున్నారు. సూర్య అయితే హౌస్ లో ఏది దొరికితే అది నాకేస్తున్నాడు. అయితే బిగ్ బాస్ మాత్రం మీకు ఫుడ్ కావాలంటే టాస్క్ ఆడాల్సిందే, ఫుడ్ గెలుచుకోవాల్సిందే అంటూ గ్రూప్ లుగా విడగొడ్డి కబడ్డీ, ఇలా చాలా రకాల టాస్క్ లు ఇవ్వగా.. మధ్యలో శ్రీసత్య-ఫైమాకి మధ్యన బిగ్ ఫైట్ కూడా జరిగింది. తర్వాత ఆదిరెడ్డి టీం గెలిచించింది. గీతు టీమ్ ఓడిపోయింది. 

Advertisement
CJ Advs

గెలిచిన ఆదిరెడ్డి టీమ్ కి ఫుడ్ వచ్చింది. కానీ ఆదిరెడ్డి తన ఫుడ్ ని గీతుకి ఇవ్వడంతో బిగ్ బాస్ కి కోపం వచ్చింది.  అదిరెడ్డిని పిలిచి బిగ్ బాస్ మీరు ఓడిన వాళ్లతో ఫుడ్ షేర్ చేసుకోవద్దు అంటే గీతుతో షేర్ చేసుకున్నారు. దానికి మీరు ఇద్దరూ పర్యవసానం అనుభవించాలి అంటూ గార్డెన్ ఏరియాలో ఉన్న గిన్నెలు తోమమని బిగ్ బాస్ చెప్పడంతో గీతు-ఆది రెడ్డిలు ఆ గిన్నెలు తోమారు. అక్కడ హౌస్ మేట్స్ అందరూ కూర్చుంటే సూర్య మాత్రం పెళ్ళికి వేస్తారు టెంట్లు.. మా గీతక్క తోముతుంది అంట్లు, చిన్న ఆలు గడ్డ ముక్క ఎంత బొక్క పెట్టింది అంటూ కామెంట్ చెయ్యగా.. అన్ని గిన్నెలు తోమేసిన గీతు-ఆది రెడ్డిలు కూర్చుని నేను ఇంతవరకు గిన్నెలు తోమలేదు అని ఆదిరెడ్డి అంటే.. నేను అన్నం తినగానే చెయ్యి కడుక్కోవడానికి గిన్నెలో నీళ్లు తీసుకువస్తారు అంటూ గీతు చెబుతున్న ప్రోమో వైరల్ గా మారింది. 

Bigg Boss Shocking Punishment To Adireddy And Geethu:

Bigg Boss 6: Latest promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs