Advertisement
Google Ads BL

ప్రభాస్‌తో మారుతి చెలగాటం


పాన్ ఇండియా స్టార్ అయ్యి ఉండి.. ఓ చిన్న దర్శకుడికి అవకాశం ఇవ్వడంపై ప్రభాస్ ఫాన్స్ ఇప్పటికి గుర్రుగానే ఉన్నారు. ఇంతకుముందే ఎలాంటి అనుభవం లేని సుజిత్‌కి, రాధాకృష్ణకి.. సాహో, రాధేశ్యామ్ అవకాశాలు ఇచ్చి చేతులు కాల్చుకున్న ప్రభాస్ మరోసారి మారుతికి అవకాశం ఇచ్చి తప్పు చేశాడనే భావనలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. మారుతి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఆయన పాన్ ఇండియా కథని డైరెక్ట్ చేసే అనుభవం లేదు, అలాంటి దర్శకుడితో ప్రభాస్ సినిమా చెయ్యడం అవసరమా అంటూ ఫాన్స్ ఎంత మొత్తుకుంటున్నా ప్రభాస్ మాత్రం సైలెంట్‌గా మారుతి సినిమాని పట్టాలెక్కించేశారు.

Advertisement
CJ Advs

 

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్.. మారుతితో చెయ్యబోయే సినిమాలో కొత్తగా కాదు చాలా డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. మారుతి-ప్రభాస్ కాంబో కథ హర్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని ఎప్పటినుండో ప్రచారం జరిగినట్టుగానే.. ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యంగా కనిపించబోతున్నాడట. అంటే ప్రభాస్‌ని అప్పుడప్పుడు ఓ దెయ్యం ఆవహిస్తుంటే.. ప్రభాస్ అందులో ఫన్ జనరేట్ చేస్తారట. ప్రభాస్‌ని ఆత్మ ఆవహించినప్పుడు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ఆయన స్టయిల్ అన్ని మారిపోయి అందులోనే కామెడీ పుట్టించబోతున్నాడట మారుతి. అది విన్న ప్రభాస్ ఫాన్స్ బేజారెత్తిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలాంటి వేషాలెయ్యడం ఎందుకు. హుందాగా ఆయన కటౌట్‌కి తగ్గ సినిమాలు చేసేదానికి అంటూ ఆందోళనపడిపోతున్నారు. కొందరైతే మా ప్రభాస్‌ని అలా ఎలా చూపించాలనుకుంటున్నావ్.. ఆయన కెరీర్‌తో చెలగాటమాడుతున్నావా.. అంటూ మారుతిపై ఫైర్ అవుతున్నారు.

Prabhas Fans Angry on Director Maruthi:

This is the Concept of the Prabhas and Maruthi combo Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs