Advertisement
Google Ads BL

దేవిశ్రీ-సుకుమార్ మధ్య డిష్యుమ్ డిష్యుమ్


దేవిశ్రీ-సుకుమార్ కాంబోలో మూవీ వస్తుంది అంటే.. ఆ మ్యూజిక్ ఆల్బమ్ పాన్ ఇండియాలో ఎంతగా సెన్సేషన్ అవుతుందో అనేది ‘పుష్ప’ ఆల్బమ్ నిరూపించింది. దేవిశ్రీ ఐటెం సాంగ్ సుకుమార్ సినిమాల్లో ఉండడం అంటే అది మాస్ ప్రేక్షకులని ఉర్రుతలూగించడమే. నేను శరీరం అయితే దేవి ఆత్మ అంటూ సుకుమార్ పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే తాజాగా ఈ ప్రాణ స్నేహితుల మధ్యన విభేదాలు తలెత్తినట్టుగా సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. పుష్ప పార్ట్ 2 పట్టాలెక్కుతున్న తరుణంలో దేవికి సుక్కుకి మధ్యన విభేదాలంటూ వార్తలు రావడం అల్లు ఫాన్స్‌లో అందోళన కనిపించేలా చేసింది. అయితే దేవిశ్రీకి-సుకుమార్‌కి మధ్యన విభేదాలు రావడానికి కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

 

అంటే సుకుమార్‌కి దేవికి పుష్ప ఆల్బమ్ విషయంలో కాకుండా సుకుమార్ ఆధ్వర్యంలో ఆయన శిష్యుడు కార్తీక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా విషయంలో వీరికి మనస్పర్థలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం దేవి 4 కోట్లు డిమాండ్ చెయ్యగా.. దానికి సుకుమార్ రెండు కోట్లు ఇస్తాను అడ్జెస్ట్ అవ్వమంటే.. దేవి కుదరదు అనడంతో దేవి శ్రీ ప్లేస్ లోకి మరో సంగీత దర్శకుడు ని తెచ్చి అఫీషియల్ గా ప్రకటించడంతో చాలామంది షాకవడమే కాదు, ఈ విషయమై దేవికి సుక్కుపై కోపం వచ్చినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ‘పుష్ప 2’పై ఏమైనా పడుతుందేమో అని ఐకాన్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Clashes Between Sukumar and Devi Sri Prasad :

Music Director Changed for Sukumar Produced Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs