Advertisement
Google Ads BL

నెల తిరక్కుండానే.. ఓటిటిలోకి స్వాతి ముత్యం


బెల్లంకొండ గణేష్ డెబ్యూ మూవీ స్వాతి ముత్యం.. గాడ్ ఫాదర్-ఘోస్ట్ చిత్రాల మధ్యలో నలిగిపోయింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5 న రిలీజ్ అయిన స్వాతి ముత్యం సింగిల్ గా వస్తే సూపర్ హిట్ అయ్యేది. కానీ చిరు-నాగ్ తో పెట్టుకుని గణేష్ ఇబ్బందిపడిపోయాడు. గాడ్ ఫాదర్ కి హిట్ టాక్ పడడంతో స్వాతి ముత్యం వెనుకబడిపోయింది. స్వాతి ముత్యం బావుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్రిటిక్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పినా.. ప్రేక్షకులు ఎవరూ ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్  చూపించలేదు. రాంగ్ టైం లో విడుదల చేసి నిర్మాతలు దెబ్బైపోయారు. లేదంటే స్వాతి ముత్యం మంచి మూవీగా గణేష్ కి డెబ్యూ మూవీ గా మిగిలిపోయేది.

Advertisement
CJ Advs

అయితే అక్టోబర్ 5 న థియేటర్స్ లో రిలీజ్ అయిన స్వాతి ముత్యం అప్పుడే ఓటిటి రిలీజ్ కి రెడీ అయ్యింది. గణేష్-వర్ష బొల్లమ్మ కలయికలో తెరకెక్కిన స్వాతి ముత్యం ఓటిటి పార్ట్నర్ ఆహా అని ఎప్పుడో వెల్లడించాం. ఇప్పుడు ఆహా లో స్వాతి ముత్యం రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు. నెలతిరక్కుండానే స్వాతిముత్యం ఈ నెల 28 న స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లుగా ప్రకటించారు. మరి థియేటర్స్ లో లైట్ తీసుకున్న స్వాతిముత్యానికి ఓటిటిలో మంచి రెస్పాన్స్ రావడం అయితే ఖాయం.

Swathi Muthyam locks its OTT release date:

Swathi Muthyam locks its OTT release date and time
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs