Advertisement
Google Ads BL

ఖబడ్ధార్: ఇదీ జగన్ జాతకం


పవన్ కళ్యాణ్  జనవాణి ముందు జగన్ వైజాగ్ గర్జన పాలిపోవడంతో, ఆంధ్ర సీఎం జగన్  మరియు అధికార పక్షం ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటి నుండి, తన స్వంత పత్రికలో, ఛానెల్లో మరియు వెబ్సైట్లలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అడ్డమైన చెత్త వ్రాస్తూ, కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ మహార్జాతకుడు అంటూ, ఎంతసేపూ వ్యక్తిగతంగా బురదజల్లటం తప్ప అందులో జల్లెడపట్టి వెతికినా కొత్తగా ఒక్క అక్షరం కూడా కనిపించదు. పవన్ కళ్యాణ్, అతని అభిమానులని, జన సైనికుల్ని తూర్పారపట్టడం తప్ప, తాము చేసిన ఘనకార్యాలు ఒక్కటికూడా చూపించలేదు.

Advertisement
CJ Advs

ఎంతసేపూ, మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ పడి ఏడవటం తప్ప, తమ ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మీద ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయో దాని మీద మాట్లాడమంటే, తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు. ఎన్ని అవినీతికేసులుంటే అంత గొప్ప అన్నమాట. పవన్ కళ్యాణ్ ముగ్గురిని ఉంచుకోలేదు, మనసులు కలవకపోతే, న్యాయబద్ధంగా విడాకులు తీసుకునే మరో పెళ్లి చేసుకున్నాడు. జగన్ మరియు అతని సమర్థించే వాళ్ళల్లో ఎంతమందికి ఎన్ని సెటప్ లు ఉన్నాయో ఆ దేవుడికి కూడా తెలియదు.

ప్రజాసేవ చేయాలని పవన్ తలిస్తే, తమకి ఎక్కడ ప్రజలను దోచుకుని పబ్బంగడుపుకునే అవకాశం రాదో అనే క్షోభ తప్ప మరేమీ కాదు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, అందినకాడికి ఏదోవిధంగా దోచుకోవడమే తప్ప,పవన్ కళ్యాణ్ లాగ దానం చేసే దమ్ము జగనన్నకు లేదు. బటన్ నొక్కడం, అందినంత దోచుకోవడం. అప్పులపేరుతో, ఆదమరిచి ఉంటె మరికొంత నొక్కేయడం. జగన్ మంత్రులు హద్దులు మీరి పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్ రావు మీద కూడా బురద చల్లారు. పవన్ విద్యార్హతలు ప్రశ్నించారు. అవును మరి, జగన్ కి దోచుకోవడంలో డాక్టరేట్ ఉందికదా. అతనికి నోబెల్ ప్రైజ్ కూడా తక్కువే. ఒకరి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తే, జగన్ వ్యక్తిగత విశాలాను కూడా ప్రస్తావించాలి.

జగన్, తండ్రి రాజశేఖర్ రెడ్డి, మరియు తాత రాజా రెడ్డిల ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ గురించి, వాళ్ళు సాగించిన హత్యా రాజకీయాల గురించి వేరే చెప్పక్కర్లేదు. తన స్వంత బాబాయ్ వివేకానంద రెడ్డి ని అలవోకగా హతమార్చి, ఆ నింద ఇతరుల పై మోపి, కోడికత్తి డ్రామాకి తెరదించిన రాజకీయ కుట్రలు కుతంత్రాలు జగన్ కి తెలిసిన విధంగా ఇంకెవ్వరికి తెలియదు. విలువల గురించి ఉపన్యసించే జగన్, తానే ఆ వలువలను దుష్ట చతుష్టయం మాదిరి, వలిచేసాడని మరచిపోయాడు. పవని దత్తపుత్రుడని హేళన చేసే జగన్, తానే సోనియా గాంధీ దత్తపుత్రుడని మరచిపోయినా జననాలు మరచిపోలేదు. కులాల, మతాల,వర్గాల, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి, ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అని అహర్నిశం అడుక్కుని, ఇప్పుడు ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. జగన్ అక్రమ సామ్రాజ్యం పునాదులు కదిలిపోతున్నాయి అందుకే ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పవన్ కి జగన్ కి మధ్య తేడా నాగలోకానికి నక్కకి ఉన్ననంత. జగన్ జిత్తులమారిన నక్కైతే ,పవన్ ప్రజల సమస్యలు తీర్చేదాకా నిద్రపోడు.

Khabardhar: This is Jagan horoscope:

Pawan Kalyan vs Jagan Mohan Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs