Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి అపరిచితుడు కి కనెక్షన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీర్తి ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా అంతటా వ్యాపించింది. అతని నటనా పాటవాన్ని అందరూ వేన్నోళ్ళ పొగిడారు. అందరూ అతడి తదుపరి చిత్రం కోసం ఆసక్తి గా వేచిచూస్తున్నారు. కానీ కొరటాల శివతో రాబోయే చిత్రం అంతకంతకూ ఆలస్యం అవుతుంటే అంతా బాధపడుతున్నారు. చిత్ర దర్శనిర్మాతలు ఎన్టిఆర్ జన్మ దిన సందర్భంగా ఒక చిన్న వీడియో గ్లింప్స్ వదిలారు. అందులో ఎన్టీఆర్ వస్తున్నా అన్న సంభాషణకే అంతా ఉత్సాహ పడిపోయారు. 

Advertisement
CJ Advs

ఈ మధ్యలో కొరటాల శివ చిరంజీవి ఆచార్య పరాజయం పొందటంతో తదుపరి చిత్రం పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మరియు బుచ్చి బాబు సాన చిత్రాలని ముందుకు తీసుకెళ్తాడాని పుకార్లు పుట్టాయి. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం కొరటాల శివ కథ గరుడ పురాణము చుట్టూ తిరుగుతుందని, ఇందులో ఎన్టీఆర్ వాటి రహస్యాలను చేధిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో మైథాలజీ కూడా ఉంటుందని వినికిడి. 

ఇది వినగానే అందరికీ చియాన్ విక్రమ్ - శంకర్ ల విజయవంతమైన చిత్రం, అపరిచితుడు గుర్తుకు వస్తోంది. అందులో కూడా విక్రమ్ గరుడ పురాణం ప్రకారం పథకాలు వేస్తుంటాడు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన ఆహార్యం కోసం పది కిలోల బరువు తగ్గాడు. ఆ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సమకూరుస్తున్నాడు.

NTR 30 connection with Aparichitudu:

NTR30 to resemble that blockbuster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs