Advertisement
Google Ads BL

రాజకీయాలు చేయనున్న నాగ చైతన్య


నాగార్జున తనయుడు నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం విశ్వయత్నాలు చేసి, ఇక తనవల్ల కాదని గ్రహించి, తనకి తగ్గ కధలు, ప్రేమ కథలు, కుటుంబ చిత్రాల కథలు ఎన్నుకుని ముందుకు సాగిపోతున్నాడు. అయితే ఇందులో కూడా ఒడిదుడుకులు ఎదురవడంతో, ఏమి చేయాలో తోచక క్రొత్త ప్రయత్నాలు చేయసాగాడు. అందులో భాగంగా, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యాడు.

Advertisement
CJ Advs

నాగ చైతన్య లవ్ స్టోరీ తో విజయం సాధించినా, ఆ విజయంలో మూడో వంతు సాయి పల్లవి ఎగిరేసుకు పోగా, థాంక్యూ చిత్రం రిలీజ్ అయిన రోజే మటుమాయమవడంతో భిన్నుడయ్యాడు. ప్రస్తుతం నాగ చైతన్య, అందాల భామ కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తూ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిత్ర చిత్రీకరణ, మైసూరు లో శరవేగంగా సాగుతోంది మరియు అందులో అరవింద్ స్వామి, ప్రేమి విశ్వనాధ్, ప్రియమణి ముఖ్య భూమికలు పోషిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, నాగ చైతన్య రాజకీయాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తుంది. దర్శకుడు వేణు ఉడుగుల నాగ చైతన్యకి రాజకీయ నేపథ్యంలో ఒక కధ చెప్పాడని, ఆ కధకి చైతుకి నచ్చి, చిత్రం చేయడానికి సిద్ధం అయ్యాడని వినికిడి. ఈ చిత్రాన్ని, వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నారు. ఇతర విషయాలు మరి కొద్ది రోజులలో వెల్లడవుతాయి. వేణు ఉడుగుల ఈ మధ్యనే రానా, సాయి పల్లవి ల విరాటపర్వం చిత్రాని కి దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైనా, అవి అందుకోలేక చతికలపడింది. ఓ.టి.టి లో కూడ చిత్ర నిర్మాత, దర్సకులకి చేదు అనుభవమే ఎదురైంది.

Director Udugula Venu is Planning a Film with Naga Chaitanya:

Naga Chaitanya indulging in politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs