Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ అలా.. చరణ్ ఇలా


ట్రిపుల్ ఆర్ సినిమాలోనే కాదు ఆ సినిమా ప్రమోషన్స్ లోను ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకి అడుగడుగునా ట్రీట్స్ ఇచ్చారు. సొంత అన్నదమ్ములు, మంచి ఫ్రెండ్స్ లా కలిసిపోయారు.. ఇలా చెప్పుకోవడానికి చాలా పేర్లు ఉన్నాయి. అంతలా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ అండ్ ఎన్టీఆర్ లు కనిపించారు. ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తర్వాత రామ్ చరణ్-ఎన్టీఆర్ మళ్ళీ కలిసింది లేదు. మళ్ళీ ఇప్పుడు జపాన్ ప్రమోషన్స్ కోసం ఈ ఇద్దరి హీరోలు మరోసారి కలిశారు. అది జపాన్ లో. జపాన్ లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ చెయ్యడానికి రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేసి ఈ ఇద్దరి హీరోలని రంగంలోకి దించబోతున్నారు. అందుకే రామ్ చరణ్-ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్ సింగిల్ గా, చాలా స్లిమ్ గా స్టైలిష్ గా జపాన్ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్ పోర్ట్ కి వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. రామ్ చరణ్ ఈ రోజు ఉదయం తన భార్య ఉపాసన అలాగే పెంపుడు పెట్ రైమా తో కలిసి జపాన్ ఫ్లైట్ ఎక్కాడు. ఇక ఎన్టీఆర్ చాలారోజుల తర్వాత ఇలా పబ్లిక్ లో కనబడితే.. రామ్ చరణ్ ఈమధ్యన తరుచూ పబ్లిక్ కి దర్శనమిస్తూనే ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా భార్య ప్రణతి, తన పిల్లలు తో కలిసి జపాన్ కి  ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కి వెళ్తే.. రామ్ చరణ్ భార్య తో కలిసి చెక్కేసాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

RRR: Ram Charan-Jr NTR all set to take over Japan:

Jr NTR gets clicked at airport as he heads to Japan for RRR promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs