Advertisement
Google Ads BL

కంగనా రనౌత్ కి క్షుద్రశక్తులా?


బాలీవుడ్ నటీమణి కంగనా రనౌత్ మాటల తూటాలకి ప్రసిద్ధిగాంచినది. కంగనా తన నటనా సామర్థ్యంతో జాతీయస్తాయిలో పురస్కారాలు అందుకోవడమే కాకుండా, ఎవరికీ వెరవకుండా ధైర్యంగా మాట్లాడడంలో నిష్ణాతురాలు. కంగనా రనౌత్ ఈ మధ్యకాలంలో మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర లో నటించింది. అటుపై ధాకడ్ అనే చిత్రంలో నటించింది. కానీ ధాకడ్ దిక్కులేకుండా పోవడంతో, కంగనా ఖంగుతింది. కంగనా ప్రస్తుతం భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) మీద ఒక చిత్రాన్ని, ఎమర్జెన్సీ తీస్తోంది. ఆ చిత్రంతో కంగనా తొలిసారి దర్శకత్వం నిర్వహిస్తోంది.

Advertisement
CJ Advs

ఇలాటి సమయంలో, కంగనా రనౌత్ సామజిక మాధ్యమంలో తనని మాంత్రికురాలు అని అంటూ నిందించారని ఆరోపించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితం, మహిళలని మాంత్రికులని,క్షుద్రవిద్యలని అభ్యసిస్తున్నారని, నిందిస్తూ, సజీవంగా కాల్చేసేవారని అన్న మాటలని, తనకి ఆపాదించుకుంటూ కంగనా ఈ విధంగా చెప్పుకొచ్చింది.

కంగనా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ మీకు సూపర్ పవర్స్ ఉంటే మిమ్మల్ని మంత్రగత్తె అంటారు.. నన్ను మంత్రగత్తె అని పిలుస్తారు, కానీ నేను వారిని కాల్చనివ్వలేదు.. బదులుగా నేను..  నేను నిజమైన మంత్రగత్తె అయ్యుండాలి వోహాహా ఆబ్రా కా దబ్రా.. అనడం తో పాటుగా హా హా ఆ రోజులు సరదాగా గడిచాయి, సినిమా నేపథ్యం, విద్య, మార్గదర్శకత్వం, ఏజెన్సీ, సమూహాలు లేదా స్నేహితులు, బాయ్‌ఫ్రెండ్‌లు లేని నేను అగ్రస్థానానికి చేరుకున్నాను… కాబట్టి వారందరూ కలిసి నేను క్షుద్రశక్తులని ఔపోసన చేస్తున్నానని బ్లాక్ మేజిక్ అని అన్నారు

Kangana Ranaut remembers being called a witch:

Kangana Ranaut recalls being called a witch who possessed black magic skills
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs