టాలీవుడ్ లో స్టార్ హీరోలైన ఎన్టీఆర్-రామ్ చరణ్ ట్రిపుల్ లాంటి పాన్ ఇండియా మల్టీస్టారర్ తో అన్ని భాషల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. రీసెంట్ గా చిరు-సల్మాన్ కలిసి గాడ్ ఫాదర్ మూవీ చేసారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు, బావాబావమరుదులైన రామ్ చరణ్- అల్లు అర్జున్ కలయికలో మల్టీస్టారర్ పై ఓ క్రేజీ న్యూస్ ని బన్నీ ఫాదర్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఓ షోలో రివీల్ చెయ్యడం హాట్ టాపిక్ గా అయ్యింది. అలీ తో సరదాగా షోలో అల్లు అరవింద్ చరణ్-బన్నీ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తనకి ఓ కోరిక ఉంది అంటూ వాళ్ళ ఇద్దరితో కలిసి చేసే సినిమాపై మట్లాడారు.
ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ.. నాకు మాత్రం ఓ కోరిక ఉంది. గీతా ఆర్ట్స్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే బావుంటుంది. ఈ మల్టీస్టార్ కాంబినేషన్‌కి పదేళ్ల ముందే నేను టైటిల్ కూడా పెట్టుకున్నాను. చరణ్ - అర్జున్ అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిష్టర్ చేశాను. ఆ టైటిల్‌ను వదలకుండా ఇప్పటి వరకు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా జరుగుతుందనే నా నమ్మకం. ప్రస్తుతం వాళ్లిద్దరూ పాన్ ఇండియా స్టార్స్, భారీ మార్కెట్ ఉన్న హీరోలు. వాళ్ళ క్రేజ్ కి సరిపోయే దమ్మున్న కథ, దర్శకుడు దొరికితే వీరి సినిమా పట్టాలెక్కుతోంది అంటూ అరవింద్ ఆ షోలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.