జన సేనాని పవన్ కళ్యాణ్ ని అన్నివిధాలా నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, అనుకున్నది సాధించినట్టుగా పవన్ కళ్యాణ్ ని నోవాటెల్ లోని హోటల్ గదికే పరిమితం చేసి, తమ చెప్పు చేతులలో ఉన్న పోలీసు యంత్రాంగం చేత నోటీసులు ఇప్పించి వైజాగ్ నుండి పంపించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.
అయినా ఎన్ని విధాలా బెదిరించినా, జన సైనికుల్ని జైళ్లల్లో నిర్బంధించినా, పవన్ కళ్యాణ్ అదరక బెదరక, పవన్ యుద్ధభేరి మోగించాడు. వైజాగ్ నుండి విజయవాడకి బయలుదేరే ముందు, తన ప్రసంగంలో గర్జించాడు. యుద్ధం మొదలైంది కాబట్టి, విజయం సాధించేదాకా నిద్రపోయేది లేదని నినదించాడు. జగన్ ని ఒక నియంతగా అభివర్ణిస్తూ, వారికి పట్టిన గతియే జగన్ కి పడుతుందని హెచ్చరించాడు. . పవన్ మాట్లాడుతూ.. దెబ్బలు తినకుండా, జైళ్లకు వెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయాలు సాధ్యం కాదు. ప్రజల కోసం ఎన్ని కేసులనైనా స్వీకరిస్తా.. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం. ప్రజల కోసం పోరాడితే నోటీసులిస్తున్నారు. మానభంగాలు చేసేవారికి అధికారం ఇస్తే ఇలాటి పరిస్థితులే ఎదురవుతాయని స్పష్టం చేసాడు.
రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి నెలకొందని, ప్రస్తుతానికి విశాఖపట్నం వీడినా, తన పోరాటాన్ని మరియు ప్రజలకి తన సంఘీభావాన్ని ఎవ్వరు ఆపలేరని ప్రకటించారు. పవన్ బయలుదేరిన తర్వాత, పవన్ ప్రభంజనం అడుగడుగునా ప్రస్ఫుటమైంది. దారి పొడుగునా ప్రజలు బయటకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. పవన్ ప్రభంజనం, జన సంద్రంతో జగన్ పతనం ఆరంభమైంది అని అందరు సంతోషిస్తున్నారు.