మెగాస్టార్ చిరంజీవిపై మహాసహస్రవధాని గరికపాటి నరసింహారావు ఈ మధ్య అలయ్ బలయ్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. తర్వాత ఆ విషయం చినికి చినికి గాలివాన అయినట్లుగా.. చిరంజీవి అభిమానులు, చిరంజీవి అంటే ఇష్టపడేవారంతా కలగజేసుకోవడంతో.. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అయితే, విషయాన్ని చిరంజీవి అక్కడే తేల్చేసినా.. ఫ్యాన్స్ చేసిన హడావుడితో.. అదొక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఆ తర్వాత చిరంజీవి కలగజేసుకుని.. ఆయన పెద్దవారు.. ఆ మాటలని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో.. ఈ సమస్య అంతటితో సద్దుమణికింది. తాజాగా ఈ ఇష్యూపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.
ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణుని ఈ ఇష్యూపై మాట్లాడాలని రిపోర్టర్ కోరాడు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘నాకు అక్కడ ఏం జరిగిందో కరెక్ట్‌గా తెలియదు. చిరంజీవిగారి ఫ్యాన్స్‌పై గరికపాటిగారు ఏదో మాట్లాడారు.. అని చెప్పారు కానీ.. పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవిగారితో ఫొటో తీసుకోవడం అనేది వాళ్ల అభిమానులందరికీ గోల్డెన్ ఆపర్చునుటీ. చిరంజీవిగారు ఒక లెజెండ్. ఆయన కనబడితే ఎవరైనా సరే.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఫొటో తీసుకుంటారు. ఇది సాధారణ విషయం. ఫ్యాన్స్ యాంగ్జయిటీని ఎవరూ ఆపలేరు..’’ అని చెప్పుకొచ్చారు.