రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 షూటింగ్ లో మరీ బిజీగా ఏం లేరు. ఈ మధ్యనే పది రోజుల పాటు వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో RC15 షూటింగ్ చిత్రీకరణలో పాల్గొన్న రామ్ చరణ్ ప్రస్తుతం భార్య ఉపాసన, పెంపుడు కుక్కపిల్ల రైమా తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. భార్య తో కలిసి రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే ఏ వెకేషన్ కో చెక్కేస్తున్నారు అనుకునేరూ.. వెకేషన్ లాంటిదే. అంటే రామ్ చరణ్-తారక్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చెయ్యడానికి జపాన్ వెళుతున్నారు.
రాజమౌళి ట్రిపుల్ ఆర్ ని జపాన్ లో గ్రాండ్ గా ఆ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అందుకే తారక్ అలాగే రామ్ చరణ్ లు జపాన్ లో ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చెయ్యడానికి వెళుతుండగా.. రామ్ చరణ్ పనిలో పని భార్య ఉపాసనని, రైమా ని వెంటేసుకుని వెళ్ళిపోతున్నాడు. అదన్నమాట రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కథ.