Advertisement
Google Ads BL

సూర్యని డైరెక్ట్ చేస్తా అంటున్న కార్తీ


అన్నదమ్ములుగా హీరోలుగా సూర్య-కార్తీ స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న సూర్య రీసెంట్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అటు కార్తీ కూడా విలక్షణమైన కథలతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా కార్తీ సర్దార్ చిత్రాన్ని దివాళి కి రిలీజ్ చెయ్యబోతున్నాడు. సర్ధార్ ప్రమోషన్స్ లో కార్తీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకుంటున్నాడు. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన రోజులు గుర్తు చేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

దానితో మీడియా వాళ్ళు మీరు ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు అని అడగగా.. దానికి కార్తీ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నేను అసిస్టెంట్ డైరెక్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది మా అన్నయ్య సూర్య సినిమాతోనే. అందుకే నేను మొదట డైరెక్ట్ చేసే సినిమాలో మా అన్నయ్య సూర్య నే హీరో. ఆయన నన్ను బాగా అర్ధం చేసుకుంటాడు. నా చెయ్యి పట్టి ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పటినుండే మా అన్నయ్య సూర్య ని డైరెక్ట్ చెయ్యాలని ఉండేది అంటూ చాలా ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు కార్తీ.

Karthi has surprising dreams for his brother Suriya:

Karthi dreams for his brother Suriya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs