బిగ్ బాస్ సీజన్ 6 ఆరు వారాలు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా ఏదో వారంలోకి అడుగుపెట్టింది. ఆరో వారంలో సుదీప ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది. ఇక గత వారం సూర్య కెప్టెన్ గా నిలవగా, రోహిత్ తనకి తానుగా రెండు వారాలు డైరెక్ట్ గా నామినేట్ చేసుకున్నాడు. దానితో వారిని వదిలిపెట్టి ఏడో వారం నామినేషన్స్ లిస్ట్ బిగ్ బాస్ లీకుల్ ద్వారా బయటికి వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ హీట్ అంతగా హౌస్ లో కనిపించలేదు అంటున్నారు. ఫైమా-వాసంతికి మధ్యలో కాస్త ఫైట్ జరిగినా, రోహిత్-శ్రీహన్ మధ్యన కొద్దిగా గొడవ జరిగినా.. ఈ నామినేషన్స్ ప్రక్రియ కూల్ గానే జరిగినట్టుగా తెలుస్తుంది.
నామినేట్ చేస్తున్న సభ్యుడిని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్లపై బురద నీళ్లు పోసి నామినేట్ చెయ్యాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొంతమంది హౌస్ మేట్స్ వాదనకు దిగినప్పటికీ.. ఈ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కెప్టెన్ సూర్య అలాగే గీతు తప్ప హౌస్ లో ఉన్న మిగతా 13 మంది నామినేషన్స్ లోకి వెళ్లారట. అందులో ఇనాయ, శ్రీహన్, రోహిత్, రేవంత్, మరీనా, వాసంతి, ఫైమా, అర్జున్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రాజ్, బాలాదిత్యలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం గీతు ని మాత్రమే నామినేట్ చెయ్యకుండా వదిలేశారని, కెప్టెన్ అయిన కారణంగా సూర్య ని నామినేట్ చెయ్యలేదు కాబట్టి వారు సేఫ్ అవ్వగా.. ఈ వారం 13 మంది రికార్డ్ స్థాయిలో నామినేషన్స్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.