Advertisement
Google Ads BL

సీక్రెట్ పెళ్లిపై పూనమ్ క్లారిటీ


నటి పూనమ్ కౌర్ కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం మానేసి.. సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన పూనమ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. మధ్యలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ పై ఇండైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ అందరి అటెన్షన్ తనవైపు ఉండేలా చూసుకున్న పూనమ్ కౌర్ ఈసారి సీక్రెట్ పెళ్లి విషయంలో హైలెట్ అయ్యింది. రీసెంట్ గా కర్వా చౌత్ పండుగ సందర్భంగా పూనా కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. కర్వా చౌత్ పండుగ రోజు పెళ్ళైన అమ్మాయిలా పూనమ్ కౌర్ చంద్రుడికి పూజలు చేసిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Advertisement
CJ Advs

అలా కర్వా చౌత్ రోజున పూనమ్ కౌర్ పూజ చెయ్యడం చూసిన చాలామంది.. ఆమె సీక్రెట్ గా వివాహం చేసుకుంది. కానీ భర్త ఎవరో బయటపెట్టకుండా ఇలా పూజ రూపంలో ఆమెకి వివాహమైనట్టుగా హింట్ ఇస్తూ పిక్ షేర్ చేసింది అనుకున్నారు. తనకి పెళ్లి అయినట్లు వస్తున్న వార్తలపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ట్విట్టర్ లో కొన్ని స్క్రీన్‌షాట్లను షేర్ చేసి.. ఇలాంటి వార్తలు రాజకీయంగా ప్రచారంలోకి వచ్చాయో లేక వేరే ఆలోచనా విధానంతో వచ్చాయో నాకు అర్థం కావడం లేదు అంటూ పండుగ, అలాగే తన పెళ్లి వెనక ఉన్న అపోహలు తొలగించేసింది. 

అయితే తనకి పెళ్లి కాలేదు అని, కానీ పెళ్లి కాకుండా కర్వా చౌత్ పండుగను ఎందుకు చేసుకుందో వివరించింది. పెళ్లి కాని అమ్మాయిలు కూడా జరుపుకోవచ్చు. తమకు కాబోయే భర్త మంచివాడు రావాలని పూజ చేసుకోవచ్చు. పెళ్లైన వాళ్లు చంద్రుడిని చూస్తే.. పెళ్లి కాని వాళ్లు నక్షత్రాలను చూస్తారు. దానితో పాటుగా మహాశివుడిని కూడా పూజిస్తారు. ఓం నమ శివాయ అంటూ తనకి పెళ్లయిపోయింది అనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

Poonam Clarity on Secret Marriage:

Poonam Kaur Recently Celebrated karwa chauth Festival
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs