నయనతార-విగ్నేష్ శివన్ లు పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా తల్లితండ్రులవడం ఎలా సాధ్యం, అసలు నిబంధనల ప్రకారమే వీరికి పిల్లలు కలిగారా అనే విషయం తమిళనాడు సర్కారు ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. పెళ్లి జూన్ లో అయితే.. అక్టోబర్ లో ఎలా పిల్లలు పుడతారు. ఎంత సరోగసి అయినా నిబంధనల ప్రకారమే పిల్లలు కనాలి, పిల్లలను సరోగసి పద్ధతి ద్వారా కనేందుకు మహిళకి 21 నుంచి 36 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలని, అలాగే ఆమె కచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండాలని, అంతేకాకుండా ఆమె తన భర్త అనుమతి తీసుకోవాలని ఈ నిబంధనలు నయన్ జంట పాటించారా అనే విషయాలపై విచారణ చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.
అయితే నయనతార-విగ్నేష్ లు కూల్ గా తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే కాదు, అభిమానులకి అందరికి హోల్సేల్ షాక్ ఇచ్చారు. ఈ విచారణలో భాగంగా తమిళనాడు హెల్త్ డిపార్ట్ మెంట్ కు ఒక అఫిడవిట్ ను సమర్పించింది నయన్ జంట. నయనతార, విఘ్నేష్ శివన్ లు ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, ఈ సంవత్సరం జూన్ లో సాంప్రాదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారని, అధికారికంగా ఆరేళ్ల క్రితమే వారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ అఫిడవిట్ తో పాటు వారు పెళ్లి చేసుకున్నట్లు తెలిపే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా పొందుపరిచారు. అంతేకాకుండా పెళ్ళైన ఐదేళ్లకి మాత్రమే సరోగసి ద్వారా పిల్లలని కనాలని నిబంధనల్ని పాటించినట్లుగా నయన్-విగ్నేష్ లు ఆ అఫిడవిడ్ లో పొందుపర్చడం చూసి తమిళనాడు గవర్నమెంట్ కూడా షాకైంది.
గతేడాది డిసెంబర్ లోనే ఈ సరోగసి పద్దతి కోసం అగ్రిమెంట్ చేసుకున్నారట నయన విఘ్నేష్ శివన్ దంపతులు.