నందమూరి నటసింహం బాలకృష్ణ-ఊరమాస్ డైరెక్టర్ గొలిపిచంద్ మలినేని కలయికలో పవర్ యాక్షన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కబోతున్న NBK107 అప్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతి కి NBK107 రిలీజ్ ఉండొచ్చని, చిరు మెగా 154 పైకి బాలయ్య NBK107 పోటీకి వెళుతుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా NBK107 టైటిల్ రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ దివాళి కి ఎలాగయినా టైటిల్ ఎనౌన్సమెంట్ ఉంటుంది అని నందమూరి ఫాన్స్ నమ్మినట్టుగానే మేకర్స్ కూడా టైటిల్ డేట్ ప్రకటించారు.
అక్టోబర్ 21 న NBK107 టైటిల్ అనౌన్సమెంట్ ఉంటుంది అంటూ ప్రకటించారు. NBK107 ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కి వచ్చిన భారీ రెస్పాన్స్ వచ్చిన కారణంగా భారీ బజ్‌ని కలిగి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. ఇక NBK107 టైటిల్ గా రెడ్డి గారు అంటూ ప్రచారం జరుగుతుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు.