నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో టాక్ షోలకే అమ్మ మొగుడు లా తయారైంది. సీజన్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సీజన్ 2 అంటే గ్రాండ్ గా అంచనాలు అందుకునేలా మొదలు పెట్టింది ఆహా ఓటిటి. మొదటి గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకు లోకేష్ ని బాలయ్య తో ఇంటర్వ్యూ చేయించి ఫన్ క్రియేట్ చేసిన ఆహా టీం సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ లని కూడా రివీల్ చేసారు. బాలయ్య తో ఆటా, పాటా, మాట మంతి చెప్పడానికి ఇద్దరు కుర్ర హీరోలు రెడీ అయ్యారు. వారే విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలు ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ లు అంటూ రివీల్ చెయ్యడమే కాదు ప్రోమో కూడా రిలీజ్ చేసారు.
ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టేజ్ పై కి వచ్చాక మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డలు అడుగుపెట్టారు. మంచి కామెడీగా, ఫన్నీగా ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని ప్రోమో చూస్తే తెలిసిపోతుంది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది అనే విమర్శలకి ఈ ఎపిసోడ్ తో చెక్ పెట్టెయ్యబోతున్నారు. మరి బాలకృష్ణ అల్లరి, ఆయన కామెడీ, ఈ కుర్ర హీరోలు చేసే హంగామాతో ఎపిసోడ్ 2 ఈ శుక్రవారం ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.