Advertisement
Google Ads BL

సలార్ అప్ డేట్ ఏమై ఉంటుందబ్బా..


మే లో సలార్ షూట్ రెస్యూమ్స్ అంటూ మొదలు పెట్టకముందే నిర్మాతలు సలార్ టీజర్ మే లో ఇచ్చేస్తాం అంటూ గొప్పలు పోయారు. అసలే రాధేశ్యామ్ ప్లాప్ అయ్యి డిస్పాయింట్ లో ఉన్న ప్రభాస్ ఫాన్స్ చాలా క్యూరియాసిటీతో సలార్ టీజర్ గురించి ఎదురు చూసారు. మే వెళ్లి నాలుగు నెలలు దాటిపోయింది. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కూడా వచ్చేస్తుంది. మధ్యలో ప్రభాస్ మోకాలి ఆపరేషన్, కృష్ణం రాజుగారి మరణంతో షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. అయినా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. రీసెంట్ గా ప్రశాంత్ సలార్ క్లైమాక్స్ పై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారనే న్యూస్ నడుస్తుంది. ప్ర‌భాస్ రేంజ్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా స‌లార్ క్లైమాక్స్ ఉంటుంద‌ని, ఫిల్మ్ హిస్ట‌రీలోనే ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా స‌లార్ క్లైమాక్స్ ఉంటుంద‌ని ప్ర‌శాంత్ నీల్ చెప్పినట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఈలోపు రేపు ఆదివారం ఉదయం సలార్ అప్ డేట్ అంటూ ఊరిస్తున్నారు. మరి సలార్ నుండి ప్రభాస్ బర్త్ డే కి రాబోయే ట్రీట్ గురించిన అప్ డేట్ ఇస్తారా.. లేదంటే టీజర్ రిలీజ్ గురించిన అప్ డేటా.. కాదు సలార్ గ్లిమ్ప్స్ అంటున్నారు, దాని అప్ డేట్ ఏమైనా ఇస్తున్నారా.. అసలు సలార్ అప్ డేట్ ఏమై ఉంటుందబ్బా అంటూ ప్రభాస్ ఫాన్స్ అనేకరకాల ఊహాగానాల్లో తేలిపోతున్నారు. మరికొద్ది గంటల్లో సలార్ అప్ డేట్ తో సోషల్ మీడియాలో భీభత్సానికి ఫాన్స్ ప్లాన్ చేసేస్తున్నారు.

Salaar update tomorrow :

Salaar interesting update tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs