Advertisement
Google Ads BL

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ అప్ డేట్


మరో పది రోజుల్లో ప్రభాస్ బర్త్ డే రాబోతుంది. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే కోసం ఆయన ఫాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే అంటే మాములుగా ఉండదు. దబిడి దిబిడే అంటూ హడావిడి చెయ్యడానికి ఫాన్స్ సిద్దమైపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సూపర్ హిట్ ఫిలిం బిల్లా 4K స్పెషల్ షోస్ అంటూ హంగామా మొదలైపోయింది. అదలా ఉంటే ప్రభాస్ బర్త్ డే రోజు ఆదిపురుష్ నుండి ఫస్ట్ సింగిల్ వదలబోతున్నట్లుగా తెలుస్తుంది. అక్టోబర్ 23 ఉదయం ఆదిపురుష్ నుండి ఫస్ట్ సింగిల్ వస్తుంది. నాగ్ అశ్విన్  దర్శకత్వంలో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K నుండి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

Advertisement
CJ Advs

అలాగే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ నుండి ఓ పోస్టర్ తో పాటుగా సలార్ గ్లిమ్ప్స్ వదిలేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. గ్లిమ్ప్స్ విషయం కన్ ఫర్మ్ కాకపోయినా.. పోస్టర్ అయితే పక్కాగా రాబోతుంది. వీటితో పాటుగా సందీప్ రెడ్డి వంగా కూడా ఎవరూ ఎక్సపెక్ట్ చెయ్యని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నాలుగు సినిమాల నుండే కాదు ప్రభాస్-మారుతి ప్రాజెక్ట్ నుండి కూడా ఓ స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రభాస్ ఫాన్స్ కి ఒకటి కాదు రెండు కాదు చాలా ట్రీట్స్ ఆయన బర్త్ డే కి రాబోతున్నాయని తెలిసి ఇప్పటినుండే సందడి మొదలు పెట్టేస్తున్నారు వాళ్ళు. 

Prabhas birthday special updates :

Prabhas birthday special updates details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs