బిగ్ బాస్ సీజన్ 6 లో టాలెంటెడ్ బోయ్ ఆర్జే సూర్య అమ్మాయిలతో చేసే రొమాన్స్ చూడలేక బుల్లితెర ప్రేక్షకులు విలవిల్లాడిపోతున్నారు. హౌస్ లోకి వచ్చినప్పటినుండి ఆరోహి తో ఫ్రెండ్ షిప్ అంటూనే హగ్గులు, ముద్దులు, స్పెషల్ సీనరీస్ పిక్స్ తో చిరాకు తెప్పించిన సూర్య.. తర్వాత టాస్క్ విషయం కన్నా ఇలాంటి ట్రాక్ తోనే హైలెట్ అయ్యాడు. ఇక ఆరోహి వెళ్లిందో లేదో.. సూర్య అంటే క్రష్ అంటూ ఇనాయ దూరిపోయింది. వీరిద్దరి మధ్యన ఏం నడుస్తుందో అర్ధం కాక ఆడియన్స్, హౌస్ మేట్స్ తెల్లబోతున్నారు. లాలీ పాప్స్ షేర్ చేసుకోవడం, గుసగుసలు, ఒకరి ఒళ్ళో ఒకరు తలపెట్టి పడుకోవడం, సూర్య మాట్లాడితే కన్నీళ్ళు పెట్టుకోవడం ఇనాయ చీర చెంగు ఇవ్వడం అబ్బో లోపల హౌస్ లో వీరి మధ్యన యవ్వారం మాములుగా లేదు.
అయితే సూర్య గర్ల్ ఫ్రెండ్ బుజ్జమ్మ మాత్రం సూర్యది ఏ తప్పులేదు.. ఇనాయనే సూర్యని తగులుంటుంది అంటూ బయట ఇంటర్వ్యూలలో స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఆరోహి-సూర్య మధ్యన బాండింగ్ గురించి అడిగితే.. వారిది ప్యూర్ ఫ్రెండ్ షిప్.. అని చెప్పింది. బుజ్జమ్మ అనే పేరు సూర్యనే పెట్టాడు, పదేళ్లుగా మేము ప్రేమించుకుంటున్నాం, అతను టాప్ 5 లో ఉండాలనుకుంటున్నాం, సూర్య చాలా మంచి వాడు అని చెబుతుంది. ఆరోహి హౌస్ నుండి వెళ్ళిపోయాక డిప్రెషన్ లోకి వెళ్తాడు అనుకున్నాం.కానీ సెట్ అయ్యాడు. ఇక ఇనాయ సూర్య అంటే క్రష్ అంటూ సూర్య వెంట పడుతుంది. అతని వెనకాలే తిరుగుతుంది. ఇనాయ గేమ్ వదిలేసి సూర్యపై శ్రద్ద పెడుతుంది. అక్కడ సూర్య తప్పులేదు, ఇనాయకే సూర్య అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటూ సూర్య గర్ల్ ఫ్రెండ్ బుజ్జమ్మ సూర్యని వెనకేసుకొని వస్తుంది.