కన్నడ మాస్ డైరెక్షర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అంటూ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి కటౌట్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం, మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుండడంతో సినిమాపై పాన్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ సెట్స్ లో బిజీగా ఉండడమే కాదు, రీసెంట్ గా కన్నడ సెన్సేషన్ మూవీ కాంతారని హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో వీక్షించారు కూడా. ప్రభాస్- ప్రశాంత్ నీల్ లు సలార్ క్లైమాక్స్ విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్ ఉండాలని ఫిక్స్ అయ్యారట.
కాంతర మూవీ ని ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు చూసి ఎంజాయ్ చెయ్యడమే కాకుండా, కాంతారా క్లైమాక్స్ వీళ్లకి బాగా నచ్చేసిందట. ప్రస్తుతం అన్ని భాషల ప్రేక్షకులు, అలాగే సినిమా ప్రముఖులు కాంతారా క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. కాంతారా క్లైమాక్స్ చూసిన ప్రశాంత్ నీల్ - ప్రభాస్ లు తమ సలార్ లో క్లైమాక్స్ ని కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్ క్లాస్ లో నిలబెట్టాలని, దాని కోసం ఎవరూ ఊహించని యాక్షన్ సీక్వెన్స్ ని పెట్టబోతున్నారట. ఇది విన్న ప్రభాస్ ఫాన్స్ కూడా సలార్ క్లైమాక్స్ విషయంలో అంచనాలు పెంచుకుంటున్నారు.