నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఒకటే వార్త వైరల్ అవుతూ ఉంది. అది మంచు విష్ణు ఆదిపురుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు అని. ఆదిపురుష్ యానిమేటెడ్ మూవీ అని ముందు చెప్పలేదు, అందుకే ఆదిపురుష్ టీజర్ నచ్చలేదు, ప్రేక్షకులకి నచ్ఛలేదు, ప్రభాస్ ని బాహుబలిగా ఊహించుకుని ఆదిపురుష్ లో అలా చూసాక డిస్పాయింట్ అయ్యాము అంటూ మంచు విష్ణు ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడినట్లుగా పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. దానితో ఆ న్యూస్ క్షణాల్లో వైరల్ గా మారింది.
అయితే తాజాగా మంచు విష్ణు తాను ఆదిపురుష్ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు, ఇదంతా ఎవరో కల్పిస్తున్న పుకార్లు. నేను ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మరో నకిలీ వార్త! పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది????? జీవితంలో కొంత ఆనందించండి. 21న #Ginna చూడండి. సానుకూలంగా ఉండండి. Please get the facts right. 🥰 అంటూ ట్వీట్ చేస్తూ ఆదిపురుష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. జిన్నా రిలీజ్ కి ముందు తనని బాడ్ చెయ్యడానికే ఇలాంటివి సృష్టిస్తున్నారు అంటూ మంచు విష్ణు ట్వీట్ చేసాడు.