Advertisement
Google Ads BL

ఆదిపురుష్ పై మంచువిష్ణు వెటకారం


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ పై వచ్చిన ట్రోల్స్ అందరూ చూసారు. ఇప్పుడు మంచు విష్ణు దానిని మరింత వెటకారం చేస్తున్నాడు. మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆదిపురుష్ ని యానిమేటెడ్ మూవీ అనుకోలేదు అని, అందుకే టీజర్ అందరిని నిరాశపరిచింది. ముందు నుండే ఇదో యానిమేటెడ్ ఫిలిం అని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉంటే బావుండేది.. లేదంటే ఇలాంటి ట్రోల్స్ వస్తాయంటూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
CJ Advs

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా వస్తుంది అంటే చాలా గొప్పగా ఊహించుకుంటాము. అందులో బాలీవుడ్ లో తానాజీ లాంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఓం రౌత్ సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే దానిని ఎక్కువగా ఊహించుకోవడం తప్పు కాదు, అందుకే ఆదిపురుష్ పై అంతగా అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి అంచనాలున్న ఆదిపురుష్ ని యానిమెటెడ్ ఫిలిం గా చూపిస్తే ఎవ్వరికి నచ్చదు. అందుకే అన్ని ట్రోల్స్ వచ్చాయి. ప్రేక్షకులకి ఆదిపురుష్ యానిమెటెడ్ ఫిలిం గా నచ్చలేదు. టీజర్ ని అందరూ ఆదరించలేదు. తనని కూడా ఆదిపురుష్ డిస్పాయింట్ చేసింది అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

 

Manchu Vishnu stirs controversy over Adi Purush:

Adi Purush.. Manchu Vishnu shocking comments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs